Darjeeling landslide: ఒకప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందలేదు. అప్పుడు ప్రకృతి విపత్తులు సంభవించే సమయంలో హెచ్చరించే వ్యవస్థలు లేవు. దీంతో నష్టాలు విపరీతంగా చోటు చేసుకునేవి. ప్రాణ నష్టం భారీగా జరిగేది. తద్వారా కనీవినీ ఎరుగని స్థాయిలో మన దేశం ప్రభావితమయ్యేది. అయితే రాను రాను శాస్త్ర సాంకేతిక రంగాలలో మన దేశం ఊహించని అభివృద్ధిని సాధించింది. ప్రపంచ దేశాలకు సవాల్ విసిరే స్థాయికి ఎదిగింది.. దీంతో భారత్ ప్రకృతి విపత్తులను ముందే పసిగట్టే స్థాయిని సొంతం చేసుకుంది.. తద్వారా నష్టాన్ని నివారించగలిగింది.
మన శాస్త్ర సాంకేతిక రంగాలు అక్కడితోనే ఆగిపోలేదు. అద్భుతమైన యంత్రాలు.. పెను విస్పోటనాన్ని కలిగించే ఆయుధాలు, బాంబులు, పరికరాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో తయారు చేసింది. తయారు చేస్తూనే ఉంది. మన మేథో సంపత్తి ఊహించని పురోగతిని సాధిస్తోంది కాబట్టి.. శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ పై చేయి సాధిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఓ సమస్య ఇప్పటికీ సవాల్ విసురుతూనే ఉంది. మనదేశంలో కొండ ప్రాంతాలు అధికంగానే ఉంటాయి. పశ్చిమ బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలలో కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. వర్షాలు కురుస్తున్నప్పుడు వరద నీటి తాకిడి వల్ల కొండ చరియలు విరిగిపడి ప్రతి ఏడాది వందల మంది చనిపోతుంటారు. మన పొరుగున ఉన్న నేపాల్ దేశంలో ఆదివారం కొండ చరియలు విరిగిపడి 51 మంది చనిపోయారు. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ ప్రాంతంలో 18 మంది కన్నుమూశారు.. ప్రతి ఏడాది వందల మంది చనిపోతున్న నేపథ్యంలో ల్యాబ్ స్లైడ్స్ ముప్పు గురించి మనదేశంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
తుఫాన్ల గురించి.. సునామీల గురించి.. వాయుగుండాల గురించి.. భూకంపాల గురించి హెచ్చరించే వ్యవస్థలు మనదేశంలో ఉన్నాయి. అదే స్థాయిలో ల్యాండ్ స్లైడ్స్ ముప్పును గుర్తించి, హెచ్చరించే వ్యవస్థలు లేకపోవడం దారుణమని ప్రజలు పేర్కొంటున్నారు. అయితే వెదర్ అలర్ట్స్ మాదిరిగానే వీటిని హెచ్చరించే వ్యవస్థలను NDMA, GSI, NLRMS డెవలప్ చేశాయి. సిక్కిం, కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ప్రస్తుతం ఈ వ్యవస్థ ట్రయల్స్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇది గనుక విజయవంతం అయితే ముప్పు నుంచి ప్రజలను కాపాడవచ్చు.
ఇతర దేశాలలో కూడా ఈ విపత్తు ఉన్నప్పటికీ.. అక్కడ హెచ్చరించే వ్యవస్థలు ఉండడంతో కొంతలో కొంత ప్రజల ప్రాణాలను కాపాడగలుగుతున్నారు. మరోవైపు భారీగా వర్షాలు కురిసినప్పుడు ల్యాండ్ స్లైడ్స్ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమయంలో ప్రజల ప్రాణాలు కూడా భారీగానే పోతున్నాయి.
#Darjeeling
Massive landslide and rainfall since the last 24 hours have taken 16 lives so far.#Darjeeling is separated from the rest of the country,roads are blocked,bridges collapsed,no electricity, no water.No respite as rain will be continuing as per met office.… pic.twitter.com/6QXt7Aurur
— Dr Dhiman Bhattacharya (@DrdhimanBhatta1) October 5, 2025