Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత, సినీనటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అక్టోబర్ 2న శ్రమదానం చేయనున్నారు. రాష్ర్టంలో రోడ్ల దుస్థితిపై ఇప్పటికే పలుమార్లు ప్రస్తావించిన ఆయన వాటిని మరమ్మతు చేసేందుకు నిర్ణయించుకున్నారు దానికి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజును వేదికగా చేసుకున్నారు. దెబ్బతిన్న రోడ్లకు మహర్దశ పట్టాలని భావించి ప్రభుత్వం పట్టించుకోవాలని కోరినా ఫలితం లేకపోవడంతో ఆయన వాటిని బాగు చేయాలని భావించారు.

ఇందులో భాగంగా అక్టోబర్ 2న రాష్ర్టంలోని పాడైన రోడ్లను మంచిగా చేసేందుకు జనసేన కార్యకర్తలు రోడ్ల మీదకు రానున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీపై దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు చేసే కార్యక్రమంలో పవన్ కల్యాణ్ శ్రమదానం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం జిల్లాలో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొంటారు.
కొత్తచెరువు పంచాయతీ పరిధిలోని పుట్టపర్తి-ధర్మవరం రోడ్డుకు శ్రమదానం చేయనున్నారు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ర్టవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో రోడ్లు మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
ఇప్పటికే సామాజిక మాధ్యమాల వేదికగా ఈనెల 2 నుంచి 4 మధ్య రోడ్ల దుస్థితిపై దృశ్యాలను చూపించారు. దీంతో నాలుగు వారాలు దాటినా ప్రభుత్వంలో స్పందన రాకపోవడంతో తానే మరమ్మతులు చేయించాలని భావించారు ఈ క్రమంలో జనసేన పార్టీ చేస్తున్న శ్రమదానం కార్యక్రమంతోనైనా ప్రభుత్వంలో చలనం రావాలని ఆకాంక్షిస్తున్నారు. అక్టోబర్ 2న ప్రతి నియోజకవర్గంలో ఒక రహదారికి మరమ్మతులు చేపట్టాలని జనసేన పార్టీ నిర్ణయించింది.