ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ దుమారం రేగుతోంది. ఆన్ లైన్ టికెట్ల విషయంలో జనసేన, వైసీపీలో మాటల యుద్ధం సాగుతోంది. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుకుంటున్నారు. తాజాగా ఈ వివాదం ఏపీ రాజకీయాల్లో చిలికి చిలికి గాలివానలా మారుతోంది. అధికార పార్టీ వైసీపీ మంత్రుల తీరుపై జనసేన కూడా అంతే స్థాయిలో స్పందిస్తోంది. వారి మాటలకు కౌంటర్ ఇస్తున్నారు. మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.
క్రికెట్ బెట్టింగులు ఆడే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పవన్ కల్యాణ్ ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీలో రాజకీయాలు జనసేన, వైసీపీ చుట్టూ తిరుగుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. మీరంటే మీరే దొంగలని విమర్శలకు దిగుతున్నారు. విమర్శలు వ్యక్తిగతంగా కూడా చేసేందుకు వెనుకాడడం లేదు. దీంతో రాష్ర్టంలో రెండు పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే విధంగా మారింది పరిస్థితి.
రాజకీయాలకు సినిమాలకు ముడిపెట్టి మరీ పరస్పర దూషణలు చేసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ ను మంత్రి వెల్లంపల్లి సన్నాసి అంటే రాష్ర్టంలో ఇంత మంది సన్నాసులున్నారా అని జనసేన మండిపడుతోంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రోజురోజుకు తీవ్ర స్థాయికి చేరుతోంది. ఆన్ లైన్ టికెట్ల బుకింగ్ వ్యవహారం ఇంత దూరం వెళ్లడంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ వర్సెస్ జనసేన నాయకులు ఆరోపణలకు దిగుతున్నారు. ఎవరు కూడా తగ్గడం లేదు. మంత్రులు ఓ పక్క విమర్శలు చేస్తుంటే జనసేన నేతలు మరోపక్క విరుచుకుపడుతున్నారు. వైసీపీ నేతల తీరుపై భగ్గుమంటున్నారు. పవన్ కల్యాణ్ సీఎం జగన్ పై ప్రత్యక్షంగా విమర్శలు చేయడంతో మంత్రులు కూడా అదే విధంగా తిరగబడ్డారు. దీంతో రెండు పార్టీల మధ్య రగడ రేగుతోంది.