
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మరి పట్టిపీడిస్తోంది. చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచంలోని అన్నిదేశాలకు పాకింది. రోజురోజుకు కోవిడ్-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు కోటికి చేరువలో ఉన్నాయి. అమెరికా, ఇటలీ, బ్రిటన్, యూకే లాంటి దేశాలు సైతం కరోనా ధాటికి విలవిలలాడిపోతున్నాయి. ఇక చిన్నచితక దేశాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. కరోనా కట్టడికి చాలా దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో ప్రజలంతా ఇంటికి పరిమితమవుతున్నారు.
కరోనా కారణంగా డెన్మార్క్ లోనూ లాక్డౌన్ విధించారు. దీంతో అక్కడ ప్రజారవాణ స్తంభించిపోయింది. వైరస్ ప్రభావంతో ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రావాలంటే జంకుతున్నారు. లాక్డౌన్లో కొన్ని సడలింపులు ఇచ్చిన ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి రావడం లేదు. ఇక పెళ్లిళ్లు, వేడుకలను వాయిదా వేసుకుంటున్నారు. ఒకవేళ పెళ్లి వేడుకలను జరుపుకోవాల్సి వస్తే మాత్రం కొద్దిమంది సన్నిహితుల మధ్య తుతూమంత్రంగా కానిచ్చేస్తున్నారు.
పాకిస్థాన్ ప్రపంచానికి ఇచ్చే సందేశం ఇదేనా?
ఇక రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు సైతం కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. సామాన్యులైన, ధనికులైన ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్ బారిన పడక తప్పదు. దీంతో ప్రతీఒక్కరు ముందుజాగ్రత్తలు పాటిస్తున్నారు. కరోనా, లాక్డౌన్ కారణంగా డెన్మార్క్ ప్రధాని మిట్టె ఫెడ్రిక్ సన్ వివాహం ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. తాజాగా ఈ శనివారం వివాహం చేసుకోవాలని అనుకున్నారు. కానీ మరోసారి వివాహాన్ని ఆమె వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు.
ఈ శనివారం నుంచే ఐరోపా సమాఖ్య సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. దీంతో మిట్టె ఫెడ్రిక్ సన్ మూడోసారి కూడా తన వివాహాన్ని వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు. వివాహం కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేసింది. ఈ సమావేశాల తరువాత వివాహం చేసుకుంటామని ప్రధాని మిట్టె ఫెడ్రిక్ సన్ పేర్కొన్నారు. అయితే అద్భుతమైన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు తాను ఎంతగానో వేచి చూస్తున్నానంటూ ప్రధాని మిట్టె ఫెడ్రిక్ సన్ ఫేస్ బుక్లో పోస్టు చేసింది. తనకు కాబోయే భర్త ‘బో’తో కలిసున్న ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రధాని నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.