Shyam Singha Roy: శ్యామ్​సింగరాయ్​ సినిమాలో హైలైట్​గా నిలిచేది ఆ సీన్లేనట?​

Shyam Singha Roy: నేచురల్​ స్టార్​ నాని హీరోగా రాహుల్​ సాంకృత్యాన్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా శ్యామ్​ సింగరాయ్​. ఈ సినిమాలో సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్​, కృతి శెట్టి హీరోయిన్​లుగా నటిస్తున్నారు. 1970లో జరిగిన కథ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు.కాగా, ఇటీవలే విడుదలైన ట్రైలర్​తో సినిమాపై భారీగా అంచనాలు […]

Written By: Sekhar Katiki, Updated On : December 17, 2021 2:56 pm
Follow us on

Shyam Singha Roy: నేచురల్​ స్టార్​ నాని హీరోగా రాహుల్​ సాంకృత్యాన్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా శ్యామ్​ సింగరాయ్​. ఈ సినిమాలో సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్​, కృతి శెట్టి హీరోయిన్​లుగా నటిస్తున్నారు. 1970లో జరిగిన కథ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు.కాగా, ఇటీవలే విడుదలైన ట్రైలర్​తో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Shyam Singha Roy

Also Read: టాలీవుడ్ స్టార్స్ అందరూ ట్యూషన్ లో చేరండయ్యా..!

ఈ క్రమంలోనే సినిమా స్టోరీపై పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సినిమాలో నాని రెండు విభిన్న మైన పాత్రల్లో కనిపించనున్నాడు. కలకత్తాలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించినట్లు తెలుస్తోంది. రెండు వేర్వేరు కాలాలకు సంబంధించిన స్క్రిప్క్ట్​తో కథకు ప్రాణం పోశారు దర్శకుడు. ఇక ఇందులో దేవదాసిగా కనిపించనున్న సాయిపల్లవి.. పూర్తిగా బెంగాళీ చీరకట్టులో ఉండటం విశేషం. దీంతో పాటు.. ఈ రెండు కాలలను లింక్​ చేస్తూ.. ఇంట్రెస్టింగ్​ సీన్స్​ ఉండనున్నాయని.. అంటున్నారు.

కాగా, ఈ సినిమాలో సాయి పల్లవితో పాటు కృతి శెట్టి, మడోనా సెబాస్టియాన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. . మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి, సిరివెన్నెల రెండు పాటలు అందించారు.మరి ఇన్ని ఇంచనాల మధ్య విడుదలకు సిద్ధమైన శ్యామ్​సింగరాయ్​ ఎలా మెప్పిస్తాడో తెలియాలంటే.. డిసెంబరు 24 వరకు వేచి చూడాల్సిందే.

Also Read: పక్క రాష్ట్రాల్లో బెనిఫిట్​ షోకు లేని ఇబ్బంది.. ఏపీలో ఎందుకొచ్చింది?