Cyber Crimes: దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. గతంలోనే పెగసస్ వ్యవహారంపై పార్లమెంట్ లో పెద్ద దుమారం రేగినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ కు గురైనట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్రం కూడా సీరియస్ గానే ఉంది. యాంటీ సైబర్ క్రైమ్ బృందంతో దర్యాప్తు చేయించేందుకు సిద్ధమైంది. ఇటీవల కాలంలో సైబర్ నేరాల సంఖ్య కూడా ఎక్కువే అవుతోంది. దీనిపై కేంద్రం దర్యాప్తు చేపడుతున్నా నిజానిజాలు తెలిసేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రధాని నరేంద్ర మోడీ, ప్రియాంక గాంధీ పిల్లలు తదితరుల ప్రముఖుల ఖాతాలే హ్యాకింగ్ కు గురైనట్లు సమాచారం. దీంతో దీనిపై కేంద్రం అడ్వాన్స్ డ్ యాంటీ సైబర్ క్రైమ్ యూనిట్ తో దర్యాప్తు చేపట్టనుంది. హ్యాకింగ్ లపై ఎలాంటి ఫిర్యాదులు రాకున్నా ప్రముఖుల వ్యవహారం కావడంతో కేంద్రం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఐటీ శాఖ పరిధిలో పనిచేసే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ నేతృత్వంలో దర్యాప్తు కొనసాగనుంది.
ఇన్ స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్ చేసినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంక గాంధీ వెల్లడించినా ఇంకా ఫిర్యాదు మాత్రం చేయలేదు. దీంతో హ్యాకింగ్ పై ఉన్నత స్థాయిలో విచారణ కొనసాగనుందని తెలుస్తోంది. తమ ఖాతాలే హ్యాకింగ్ కు గురైతే ఇక సామాన్యుల సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
గతంలో పెగసస్ వ్యవహారంపై కూడా ఇలాగే వివాదం రేగింది. తమ ఫోన్లు ట్యాపింగ్ కు గురైనట్లు సభలో వెల్లడించడంతో ప్రభుత్వం ఆ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు అంగీకరించినా తరువాత క్రమంలో అంతా కనుమరుగైపోయింది. ఇప్పుడు హ్యాకింగ్ వ్యవహారం కూడా వివాదం రేపుతున్నా చివరికి ఎక్కడికి వెళుతుందో చెప్పలేం.
Also Read: 2021 Political Roundup: ఈ ఏడాది దేశంలో జరిగిన అతిపెద్ద ఘటనలివీ