కట్‌ చేసిన జీతాలు నాలుగు వాయిదాల్లో చెల్లింపులు

తెలంగాణ రాష్ట్ర సర్కార్‌‌ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు అందించింది. కరోనా టైంలో కోత విధించిన వేతనాలకు సంబంధించిన బకాయిలను విడతల వారీగా చెల్లించాలని నిర్ణయించింది. పెన్షనర్లకు అక్టోబర్‌‌, నవంబర్‌‌లలో రెండు విడతలుగా, ఉద్యోగులకు అక్టోబర్‌‌, నవంబర్‌‌, డిసెంబర్‌‌, జనవరిలలో నాలుగు విడతలుగా చెల్లింపులు జరిపేందుకు తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. Also Read: సీఎం కేసీఆర్ మనవడికి ఏమైంది? కరోనా సంక్షోభం కారణంగా రాష్ట్రంలో అమలు చేసిన లాక్‌డౌన్‌తో రాష్ట్ర ఆర్థిక […]

Written By: NARESH, Updated On : October 1, 2020 11:29 am
Follow us on


తెలంగాణ రాష్ట్ర సర్కార్‌‌ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు అందించింది. కరోనా టైంలో కోత విధించిన వేతనాలకు సంబంధించిన బకాయిలను విడతల వారీగా చెల్లించాలని నిర్ణయించింది. పెన్షనర్లకు అక్టోబర్‌‌, నవంబర్‌‌లలో రెండు విడతలుగా, ఉద్యోగులకు అక్టోబర్‌‌, నవంబర్‌‌, డిసెంబర్‌‌, జనవరిలలో నాలుగు విడతలుగా చెల్లింపులు జరిపేందుకు తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: సీఎం కేసీఆర్ మనవడికి ఏమైంది?

కరోనా సంక్షోభం కారణంగా రాష్ట్రంలో అమలు చేసిన లాక్‌డౌన్‌తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా పడిపోయింది. ఆదాయం నిలిచిపోయింది. దీంతో సర్కార్‌‌ మార్చి, ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించి ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్లలో కోత విధించింది. ఒక్కొక్కటిగా సడలింపులు రావడంతో ఆదాయం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. దీంతో ప్రభుత్వం జూన్‌కు సంబంధించి ఉద్యోగులకు పూర్తి వేతనం, పెన్షనర్లకు పూర్తి పింఛన్‌ ఇవ్వడానికి సీఎం కేసీఆర్‌‌ నిర్ణయించారు. తాజాగా.. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుండడంతో ఉద్యోగులు, పెన్షనర్ల కోత విధించిన డబ్బులను కూడా ఇవ్వాలని అనుకుంది.

తమ జీతాల్లోంచి కట్‌ చేసిన డబ్బులు ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందా అని ఇన్నాళ్లు ఉద్యోగులు ఎదురుచూశారు. బకాయిలు చెల్లించాలని చాలా వరకు ఉద్యోగుల నుంచి విజ్ఞప్తులు కూడా ప్రభుత్వానికి అందాయి. కరోనా నేపథ్యంలో పరిస్థితులు చక్కబడితే వెంటనే చెల్లిస్తామంటూ గతంలోనూ సీఎం కేసీఆర్‌‌ చెప్పుకొచ్చారు.

Also Read: అన్ లాక్ 5.0లో పాఠశాలలు తెరుస్తారా…? విద్యార్థుల భవిష్యత్తేంటి..?

తాజాగా.. వేతనాలను, బకాయిలను దశల వారీగా చెల్లించాలని నిర్ణయం తీసుకోవడంతో అటు పెన్షనర్లలోనూ.. ఇటు ఉద్యోగుల్లోనూ ఆనందం వెల్లివిరిసింది. కొద్ది రోజుల్లో దసరా పండుగ ఉన్నందున పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను కూడా విడుదల చేయాలని టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్‌‌ ప్రభుత్వాన్ని కోరారు.