
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో కూడా ఆంక్షలు విధించని ఏపీ ప్రస్తుతం రోజువారీ కరోనా కొత్త కేసులు పెద్ద మొత్తంలో నమోదు కావడం లేదు. కరోనా వల్ల సంభవిస్తోన్న మరణాలు కూడా నియంత్రణలోనే ఉన్నాయి. రోజు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్న సమయంలో కూడా ఏపీ లాక్ డౌన్ విధించలేదు. కఠిన ఆంక్షలు మాత్రం విధించింది.
ఈ సమయంలో నిర్ణీతసమయంలో దుకాణాలు, వాణిజ్య సముదాయాలను తెరుచుకోవడానికి అవకాశం ఇచ్చింది. రాత్రి కర్ఫ్యూ విధించింది. ప్రస్తుత తరుణంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న క్రమంలో ఆంక్షలను సడలించింది. వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చింది. రాత్రి కర్ఫ్యూను పొడిగిస్తూ వచ్చింది. రాత్రి పది గంటల నుంచి తెల్లవారు జామున 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది.
రాత్రి పది గంటల తరువాత దుకాణాలు తెరవడానికి పోలీసులు అనుమతించడం లేదు. వాహనాల రాకపోకలపై పెద్దగా ఆంక్షలు లేనప్పటికి దుకాణ సముదాయాలను తెరిచిఉంచడంపై ఆంక్షలు కొనసాగిస్తోంది. తాజాగా ఈ నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగించింది. ఏపీ ప్రభుత్వం మరో వారం రోజుల పాటు ఈనెల 21 వరకు నైట్ కర్ఫ్యూను పొడిగించింది. నైట్ కర్ఫ్యూ శనివారం రాత్రితో ముగిసింది.
రాష్ర్ట వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం కొత్తగా 1535 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 16 మంది మరణించారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 299 కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు 1992,191 కి చేరుకున్నాయి. అందులో 19,60,350 మంది డిశ్చార్జి అయ్యారు. 13,631 మంది మరణించారు.యాక్టివ్ కేసులు 18,210 గా నమోదయ్యాయి.