ఓటర్ ఐడీలో అడ్రస్ ను ఆన్ లైన్ లో లేదా ఆఫ్ లైన్ లో మార్చుకోవచ్చు. ఆన్ లైన్ లో ఓటర్ కార్డ్ అడ్రస్ ను మార్చుకోవాలని భావిస్తే https://www.nvsp.in/ వెబ్ సైట్ ద్వారా సులభంగా మార్చుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఆ వెబ్ సైట్ లో ఫామ్ 6ను ఓపెన్ చేసి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంకు మారితే ఆ ప్రాంతం వివరాలను ఎంటర్ చేసి అడ్రస్ ను మార్చుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా నియోజకవర్గంలో మరో ప్రాంతానికి మారితే ఫామ్ 8ఏ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది.
అడ్రస్ ను ఛేంజ్ చేసుకోవాలని అనుకునే వాళ్లు ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫోటో, అడ్రస్ ప్రూఫ్, ఇతర డాక్యుమెంట్లను అప్ లోడ్ చేసి సులభంగా అడ్రస్ ను మార్చుకోవచ్చు. లేదా ఆ ఫామ్ లను డౌన్ లోడ్ చేసి అవసరమైన డాక్యుమెంట్లను జత చేయడంతో పాటు పూర్తి వివరాలు నింపి సమీపంలోని ఎన్నికల అధికారి కార్యాలయంలో అందజేయవచ్చు.
అదే వెబ్ సైట్ లో అప్లేకేషన్ స్టేటస్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయడంతో పాటు రిఫరెన్స్ ఐడీ ఎంటర్ చేయడం ద్వారా దరఖాస్తు స్టేటస్ ను తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది.