నాగశౌర్య అనగానే.. సాఫ్ట్ లుక్ లో ఉండే లవర్ బాయ్ పిక్చర్ గుర్తొస్తుంది. కానీ.. అప్ కమింగ్ మూవీ ‘లక్ష్య’లో క్వైట్ అపోజిట్ లో కనిపించబోతున్నాడీ యంగ్ హీరో. ఆ మధ్య రిలీజ్ చేసిన ఓ స్టిల్ మైండ్ బ్లోయింగ్ అనిపించింది. కండలు తిరిగిన దేహంతో.. రింగులు తిరిగిన జుట్టుతో.. నాగశౌర్య కటౌట్ అద్దరిపోయింది. లేటెస్ట్ గా మరో పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్.
ఇండిపెండెన్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని రిలీజ్ చేసిన పోస్టర్లో పర్ఫెక్ట్ స్పోర్ట్స్ పర్సన్ లా కనిపిస్తున్నాడు శౌర్య. నరాలు తేలిన హ్యాండ్ తో వీరోచితంగా ఉన్నాడు. అయితే.. ఈ పోస్టర్లో టీమిండియాను తలపించే 11 నెంబర్ బ్లూ జెర్సీని వేసుకోవడమే కాకుండా.. పార్ధు అనే పేరును రాసుకున్నాడు.
పార్ధు అంటే.. మహేష్ బాబు అతడు సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఈ పేరు ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడే.. సినిమాలో అదే పేరు పెట్టుకున్నాడు శౌర్య. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ రిలీజ్ చేసిన శౌర్య లుక్ కు మంచి స్పందన లభిస్తోంది.
సంతోష్ జాగర్లపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో.. కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. విలక్షణ నటుడు జగపతి బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆర్చరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ.. అన్నిరకాల కమర్షియల్ హంగులతో రూపొందిస్తున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో.. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారయణదాస్ కె.నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.