కోర్టు ధిక్కరణ ఖర్చులకు రూ.58 కోట్లు.. సీఎస్ సోమేశ్ కు చిక్కులు

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు చిక్కు ఏర్పడింది. కోర్టు ధిక్కారణ కేసుల్లో విచారణకు రూ.58 కోట్లు విడుదల చేసినట్లుగా జీవో జారీ చేయడంతో దానిపై ఓ వ్యక్తి ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తారని హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఆశ్చర్యపోయిన కోర్టు నిధులు డ్రా చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ను వాయిదా వేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని సీఎస్ కు వ్యక్తిగతంగా నోటీసులు కూడా జారీ చేయడంతో కథ […]

Written By: Srinivas, Updated On : August 5, 2021 5:01 pm
Follow us on

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు చిక్కు ఏర్పడింది. కోర్టు ధిక్కారణ కేసుల్లో విచారణకు రూ.58 కోట్లు విడుదల చేసినట్లుగా జీవో జారీ చేయడంతో దానిపై ఓ వ్యక్తి ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తారని హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఆశ్చర్యపోయిన కోర్టు నిధులు డ్రా చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ను వాయిదా వేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని సీఎస్ కు వ్యక్తిగతంగా నోటీసులు కూడా జారీ చేయడంతో కథ అడ్డం తిరిగింది. హైకోర్టు ఆదేశాలతో నిర్ఘాంతపోయిన సీఎస్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

అయితే రూ.58 కోట్లు తనపై కోర్టు ధిక్కారణ కేసుల కోసం కాదని కోర్టు ఆదేశించిన వారికి పరిహారం అందించడానికి అని వివరించారు. ఈ విషయాన్ని విచారణ సందర్భంగా హైకోర్టు దృష్టికి తీసుకురావడంలో విఫలమయ్యాయని ఆయన తరఫు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ నిధులు విడుదల ఆపాలని ఇచ్చిన ఉత్తర్వులను ఆపాలని కోరారు. పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించారని వాదించారు. అయితే జీవో ఏమైందని హైకోర్టు ప్రశ్నించింది.

జీవో కోర్టు ధిక్కరణ ఖర్చుల కోసమేనని ఉండడంతో ప్రభుత్వం తరఫు న్యాయవాది జవాబు చెప్పే పరిస్థితి లేకపోవడంతో జీవోలు కనీస పరిశీలన లేకుండా ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. న్యాయశాఖ పరిశీలించిందా అని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. జీవో జారీలో నిర్లక్ష్యం వల్ల ఇటు నిర్వాసితులకు అటు సీఎస్ కు సమస్యలు ఎదురయ్యాయి. కోర్టు ఉత్తర్వులను వెనక్కి తీసుకోగలిగేలా ఒప్పించగలగాలి. దీంతో సీఎస్ కు మరిన్ని ఇబ్బదులు తలెత్తుతున్నాయి.

సీఎస్ సోమేశ్ కుమార్ కు తలనొప్పులు ఏర్పడనున్నాయి. కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ.58 కోట్లు విడుదల చేయాలని కోరడంతో కోర్టు ఆక్షేపించడంతో చిక్కులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు నిధుల విడుదలకు మోకాలడ్డితే పరిస్థితి ఏంటని ఆందోళన నెలకొంది. దీంతో తెలంగాణ సర్కారు తప్పిదాలతో ఇంత భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయడంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.