అక్కినేని సమంత సోషల్ మీడియాలో తన పేరుకు ముందు ఉన్న ‘అక్కినేని’ పేరును తొలగించింది. అసలు సమంత ఉన్నట్టుండి తన పేరుని ఎందుకు మార్చుకొంది ? చైతు – సామ్ మధ్య గొడవ జరిగిందా ? లేక, మరేదైనా కారణం ఉందా ? అంటూ నెటిజన్లు ఆరా తీయడం, గాసిప్ రాయుళ్లు ఇష్టమొచ్చినట్లు పుకార్లు పుట్టించడంతో ఈ వార్త బాగా వైరల్ అయింది.
అయితే ఇప్పుడు కేవలం “S” అనే అక్షరాన్ని మాత్రమే ఉంచి మిగతాది అంతా తొలిగించింది సామ్. మొదటి అక్షరం మినహా అన్ని అక్షరాలతో పాటు ఇంటి పేరు కూడా తీసెయ్యడం వెనుక ఏదో కారణం ఉంది అంటూ మొదలైన రకరకాల ఊహాగానాల పై, సామ్ ఇంతవరకు స్పందించలేదు. సమంత ఎందుకు సైలెంట్ గా ఉంది అంటూ కూడా వార్తలు రాశారు.
అయితే, ఈ పుకార్లు అన్నిటికీ క్లారిటీ దొరికింది. సమంత తన పేరును మార్చుకుంది.. అదే, కుదించింది ఒక యాడ్ ప్రొమోషన్ కోసం. ఒక ఫ్యాషన్ లేబెల్ కలెక్షన్ ప్రమోషన్ లో భాగంగా సమంత ఈ విధంగా చేయాల్సి వచ్చిందట. ఎందుకంటే.. సమంత సోషల్ మీడియా ద్వారా కూడా కోట్లు సంపాదిస్తున్న సంగతి తెలిసిందే.
కేవలం ఒక్క ఇన్ స్టాగ్రామ్ లోనే సామ్ ఒక బ్రాండ్ కి సంబంధించిన పోస్ట్ నే షేర్ చేసినందుకు 15 లక్షలు తీసుకుంటుంది. అందుకే, ఇప్పుడు ట్విట్టర్ లో యాక్టివిటీ తగ్గించి.. ఇన్ స్టాగ్రామ్ పై పడింది. మొత్తానికి సమంత తన పేరును కూడా ప్రమోషన్ కి లింక్ చేసి క్యాష్ చేసుకోవడంతో మీడియా కూడా మిస్ లీడ్ అయింది.
ఇక చైతు – సామ్ విడిపోతున్నారనే వార్తలు పూర్తిగా అవాస్తవం. చైతు -సామ్ మధ్య మంచి అనుబంధం ఉందట. అవున్లే అండి. దాదాపు రెండు సంవత్సరాలు డేటింగ్ అనంతరం సమంత – నాగచైతన్య 2017లో వివాహం చేసుకున్నారు. పెళ్లి అయిన మొదటి రోజు నుండి ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంది. ఈ జంట కలిసి మరో సినిమా చేయాలనే ఆలోచనలో ఉంది.