CP Series On Rave Party: హైదరాబాద్ రేవ్ పార్టీ జరిగిందనే వార్తలు ఉదయం నుంచి సంచలనం రేపుతున్నాయి. హైదరాబాద్ లోని ర్యాడిసన్ బ్లూ హోటల్ లోని ఫండింగ్ మింక్ పబ్ లో జరిగిన ఈ పార్టీపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి జరిపి దాదాపు 150మందిని పట్టుకున్నారు. ఇందులో టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు ఉండటంతో అందరూ షాక్ అయిపోతున్నారు.
ఇందులో మెగా డాటర్ నిహారిక, ఫేమస్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నారు. అయితే వారందరికీ ఉదయం వరకు పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు.. వారికి నోటీసులు ఇచ్చి పంపించేశారు. వీరిని త్వరలోనే విచారణకు పిలిచే అవకాశం కూడా ఉంది. అయితే ఈ ఘటనపై సీపీ ఆనంద్ యాక్షన్ తీసుకున్నారు.
Also Read: Niharika Konidela: నిహారిక అర్ధరాత్రి నుంచి అక్కడే ఉందట
ఈ పబ్ లో ఎప్పటి నుంచో డ్రగ్స్ వాడుతున్నారని స్థానికులు పలుమార్లు చెప్పినా.. పోలీసులు పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. పైగా పోలీస్ స్టేషన్ కు దగ్గరలోనే ఇంత పెద్ద ఎత్తున పార్టీ జరుగుతున్నా నిర్లక్ష్యంగా ఉన్నారని ఆ స్టేషన్ సీఐ శివచంద్రను సస్పెండ్ చేశారు సీపీ ఆనంద్. అలాగే ఏసీపీకి చార్జ్ మెమో పంపించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని చెప్పారు.
ఇక ఇదే ఘటనపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ స్పందించారు. తన కొడుకు ఆ పార్టీలో ఉన్నాడనే వార్తలను ఆయన ఖండించారు. తన కొడుకు కేవలం ఫ్రెండ్ పుట్టినరోజు పార్టీకే వెళ్లాడని క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి కల్చర్‌ను తాము ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నామని, హైదరాబాద్ లో ఇలాంటి పబ్ లను బ్యాన్ చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ కల్చర్‌ను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరుఫున పోరాడుతామన్నారు.
Also Read:ICC Women’s World Cup Final: మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఏడోసారి జగజ్జేత..