https://oktelugu.com/

దేశంలో 20 లక్షలకు చేరిన కరోనా టెస్టులు

ఈ నెల చివరికల్లా దేశం రోజుకు లక్ష కొవిడ్ 19 పరీక్షలు నిర్వహించే స్థాయికి చేరుకుంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. హర్షవర్ధన్ విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం నాటికి దేశవ్యాప్తంగా 20 లక్షల టెస్టుల మార్క్‌కు చేరుకున్నామని కూడా చెప్పారు. మంత్రి జాతీయ అంటువ్యాధుల నిరోధక కేంద్రం (ఎన్‌సిడిసి) కేంద్రంలో అతి తక్కువ సమయంలో కోవిడ్19 టెస్టింగ్ యంత్రాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా జాతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్), ఎన్‌సిడిసిలు కలిసి కోవిడ్19 శాంపిల్స్‌ను […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 15, 2020 / 12:10 PM IST
    Follow us on

    ఈ నెల చివరికల్లా దేశం రోజుకు లక్ష కొవిడ్ 19 పరీక్షలు నిర్వహించే స్థాయికి చేరుకుంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. హర్షవర్ధన్ విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం నాటికి దేశవ్యాప్తంగా 20 లక్షల టెస్టుల మార్క్‌కు చేరుకున్నామని కూడా చెప్పారు. మంత్రి జాతీయ అంటువ్యాధుల నిరోధక కేంద్రం (ఎన్‌సిడిసి) కేంద్రంలో అతి తక్కువ సమయంలో కోవిడ్19 టెస్టింగ్ యంత్రాన్ని ప్రారంభించారు.

    దేశవ్యాప్తంగా జాతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్), ఎన్‌సిడిసిలు కలిసి కోవిడ్19 శాంపిల్స్‌ను పరీక్షించడానికి 500 ల్యాబ్‌లను అభివృద్ధి చేశాయని చెప్పారు. రోష్ కంపెనీకి చెందిన కోబాస్6800 యంత్రాన్ని ప్రారంభిస్తూ ఇది పూర్తిగా ఆటోమేటెడ్ యంత్రమని, రాత్రిపూట పని చేయనప్పటికీ రోజుకు 800 టెస్టులు నిర్వహించగలదని పేర్కొన్నారు.

    ఇప్పటివరకు ఇలాంటి యంత్రాలను భువనేశ్వర్‌లోని ఐసిఎంఆర్‌లో ఒకటి, పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో ఒకటి ఏర్పాటు చేశారు. తాజాగా ఇప్పుడు ఎన్‌సిడిసిలో ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మరిన్ని యంత్రాలకు ఆర్డర్ చేసిందని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు.

    గత మూడు రోజులుగా దేశంలో కరోనా కేసులు రెట్టింపు అయ్యే రేటు 13.9 శాతానికి తగ్గిందని హర్షవర్ధన్ తెలిపారు. అంతేకాకుండా గత 24 గంటల్లో14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని కూడా ఆయన చెప్పారు.

    దామన్, డయ్యు, సిక్కిం, నాగాలాండ్, లక్షదీవుల్లో ఇప్పటివరకుఒక్క కరోనా కేసు కూడా రాలేదని కూడా ఆయన తెలిపారు. ‘గత 14 రోజులుగా డబ్లింగ్ రేటు 11.1 రోజులుగా ఉండగా, గత మూడు రోజులుగా అది 13.9 రోజులకు తగ్గడం సంతోషించదగ్గ పరిణామం’ అని మంత్రి పేర్కొన్నారు.

    ఇలా ఉండగా, 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,722 పాజిటివ్ కేసులు నమోదుకాగా, దేశంలో మొత్త కేసుల సంఖ్య 78,003కు చేరున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 134 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోగా, ఇప్పటివరకు ఈ వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 2,549కి చేరుకుంది.