https://oktelugu.com/

మెగాస్టార్ ను సూపర్ స్టార్ ఢీ కొడుతారా?

ప్రతీయేటా సంక్రాంతికి బడా హీరోల సినిమాలు థియేటర్లలో కనువిందు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈయేడాది సంక్రాంతికి కూడా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా రిలీజై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి.‘అలవైకుంఠపురములో’ మూవీతో అల్లు అర్జున్, ‘సరిలేరునీకెవ్వరు’తో మహేష్ బాబు ఇద్దరు కూడా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టుందుకొని ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఇదిలా ఉంటే లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్ల్ లన్నీ వాయిదాపడటంతో ఈసారి సంక్రాంతి పోటీ ఓ రేంజ్లో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 15, 2020 / 12:01 PM IST
    Follow us on

    ప్రతీయేటా సంక్రాంతికి బడా హీరోల సినిమాలు థియేటర్లలో కనువిందు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈయేడాది సంక్రాంతికి కూడా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా రిలీజై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి.‘అలవైకుంఠపురములో’ మూవీతో అల్లు అర్జున్, ‘సరిలేరునీకెవ్వరు’తో మహేష్ బాబు ఇద్దరు కూడా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టుందుకొని ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఇదిలా ఉంటే లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్ల్ లన్నీ వాయిదాపడటంతో ఈసారి సంక్రాంతి పోటీ ఓ రేంజ్లో ఉండేలా కన్పిస్తోంది.

    2021 సంక్రాంతి పోటీలో ఇద్దరు బిగ్ స్టార్లు పోటీపడుతుండటం ఆసక్తిని రేపుతోంది. ఈసారి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని ఢీకొట్టేందుకు రెడీ అవుతున్నాడు. రజనీకాంత్ మూవీలన్నీ మూడేళ్లుగా సంక్రాంతికే విడుదల అవుతున్నాయి. 2020 సంక్రాంతి ‘దర్బార్’, 2019లో ‘పేట’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తాజాగా షూటింగ్ జరుపుకుంటున్న ‘అన్నాత్తే’ మూవీని దీపావళి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేసింది. అయితే లాక్డౌన్ కారణంగా షూటింగ్ వాయిదాపడటంతో ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రజనీతోపాటు కీర్తిసురేష్, సీనియర్ హీరోయిన్లు ఖుష్భూ, మీనా నటిస్తున్నారు.

    డైరెక్టర్ కొరటాల శివ ప్రతిష్టాత్మకంగా మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ను తెరకెక్కిస్తున్నాడు. మెగాస్టార్ అభిమానులకు అలరించేలా ‘ఆచార్య’ను తీర్చిదిద్దుతున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. తొలుత దసరాకు ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే సినిమా వాయిదాపడటంతో ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలువనుందని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ కీరోల్ చేస్తున్నారు. రాంచరణ్ డేట్స్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీపై ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ చరణ్ డేట్స్ అడ్జస్ట్ కాకపోతే ఈ మూవీ ఉగాదికి పోస్టుపోన్ అవడం ఖాయంగా కన్పిస్తుంది. కాగా ఈ మూవీలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించనుంది. చిరు పక్కన యంగ్ హీరోయిన్ రెజీనా ఆడిపాడనుంది. ఈ మూవీపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈసారి సంక్రాంతి మెగాస్టార్-సూపర్ స్టార్ తలపడనుండటంతో వీరిద్దరిలో గెలుపెవరిదీ అనే చర్చ మొదలైంది.