https://oktelugu.com/

Corona in Telangana: తెలంగాణలో కోర‌లు చాస్తున్న కరోనా.. లాక్ డౌన్ తప్పదా..?

Corona in Telangana: తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1913 కేసులు నమోదు కాగా, మరో ఇద్దరు చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 6,75,573కు చేరింది. ఇక మరణాల సంఖ్య 4036కు పెరిగింది. తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 1213 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఇక రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 213, 161 మంది చొప్పున వైరస్ బారిన పడ్డారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తరువాత నుంచి […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 7, 2022 / 01:53 PM IST
    Follow us on

    Corona in Telangana: తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1913 కేసులు నమోదు కాగా, మరో ఇద్దరు చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 6,75,573కు చేరింది. ఇక మరణాల సంఖ్య 4036కు పెరిగింది. తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 1213 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఇక రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 213, 161 మంది చొప్పున వైరస్ బారిన పడ్డారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తరువాత నుంచి హైదరాబాద్ లో కేసులు పెరుగుతూ వస్తున్నాయి. జనవరి 2న 212, 3న 294, 4న 659, 5న 979, 6న 1214 కేసులు నమోదయ్యాయి.

    Corona in Telangana

    హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై ఎటువంటి ఆంక్షలు విధించకపోవడంతోనే ప్రస్తుత పరిస్థితికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో రోజువారి కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఇక, ఇతర జిల్లాల్లో నమోదైన కేసులను పరిశీలిస్తే మహబూబాదాద్ జిల్లాలో 33, నిజామాబాద్ జిల్లాలో 28, ఖమ్మంలో 25, హన్మకొండలో 24, కరీంనగర్‌లో 24, సంగారెడ్డిలో 24 కేసులు నమోదయ్యాయి.

    Also Read: థర్డ్ వేవ్ వచ్చినట్టే.. దేశంలో కరోనా కల్లోలం షురూ!

    మిగతా జిల్లాలో20 లోపే కేసులు నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వరుసగా ఆరో రోజు కూడా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. అలాగే ములుగు జిల్లాలో కూడా తాజాగా ఒకరికి కూడా వైరస్ సోకలేదు. నారాయణపేట్ జిల్లాలో 1, నాగర్ కర్నూల్‌లో 2, సిరిసిల్ల, వరంగల్ రూరల్ జిల్లాల్లో 3 చొప్పున కేసులు నమోదయ్యాయి.

    అయితే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వైరస్ వేగంగా విస్తరిస్తున్న జీహెచ్ఎంసీలో కఠినమైన ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ప్రజా రవాణాలైన మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీస్ సర్వీసులను తగ్గించే అవకాశం లేకపోలేదు. అలాగే మాల్స్, మల్టీపెక్స్‌లలో 50శాతం ఆక్యుపెన్సీతో నడిచేలా ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ కేసుల‌ను చూస్తుంటే.. త్వ‌ర‌లోనే లాక్‌డౌన్ పెట్టేలా క‌నిపిస్తోంది. ఎందుకంటే జీహెచ్ ఎంసీలో త్వ‌ర‌గా కేసులు పెరుగుతాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. మ‌రి రాబోయే రోజుల్లో ఎలాంటి ప‌రిస్థితులు ఉంటాయో చూడాలి.

    Also Read: కమ్మేస్తున్న కరోనా.. థర్డ్ వేవ్ మొదలైందా?

    Tags