Sankranthi RTC Bus: ఏపీ బస్సులు ఖాళీగా.. తెలంగాణ బస్సులు ఫుల్ గా… కారణమిదే?

Sankranthi RTC Bus: ఏపీ, తెలంగాణ ఆర్టీసీలు ఈ సంక్రాంతి పండుగను క్యాష్ చేసుకుందామని బాగానే స్కెచ్ గీశాయి. ఏపీ ఆర్టీసీ టికెట్ రేట్లు పెంచి ఈసారి పండక్కి లాభాలు గడిద్దామని యోచించింది. అదే పండుగకు రేట్లు పెంచకుండా ప్రయాణికులను ఆకర్షించి భారీ లాభాలు కళ్ల చూస్తుంది తెలంగాణ ఆర్టీసీ.. ఏపీ, తెలంగాణ ఆర్టీసీ లు తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు లాభం కాగా.. ఏపీకి నష్టాలను మిగులుస్తున్నాయట.. ఐపీఎస్ సజ్జనార్ తెలంగాణ ఆర్టీసీ ఎండీ అయ్యాక పలు […]

Written By: NARESH, Updated On : January 7, 2022 1:33 pm
Follow us on

Sankranthi RTC Bus: ఏపీ, తెలంగాణ ఆర్టీసీలు ఈ సంక్రాంతి పండుగను క్యాష్ చేసుకుందామని బాగానే స్కెచ్ గీశాయి. ఏపీ ఆర్టీసీ టికెట్ రేట్లు పెంచి ఈసారి పండక్కి లాభాలు గడిద్దామని యోచించింది. అదే పండుగకు రేట్లు పెంచకుండా ప్రయాణికులను ఆకర్షించి భారీ లాభాలు కళ్ల చూస్తుంది తెలంగాణ ఆర్టీసీ.. ఏపీ, తెలంగాణ ఆర్టీసీ లు తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు లాభం కాగా.. ఏపీకి నష్టాలను మిగులుస్తున్నాయట..

apsrtc-vs-tsrtc

ఐపీఎస్ సజ్జనార్ తెలంగాణ ఆర్టీసీ ఎండీ అయ్యాక పలు విప్లవాత్మక చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచారు. అర్హులకు రాయితీలు ఇచ్చి ప్రయాణాలు పెరిగేలా చేశారు. అందుకే ఇప్పుడు తెలంగాణ బస్సుల్లో ఎక్కువమంది ప్రయాణిస్తున్నారు.

తాజాగా సంక్రాంతి పండుగ రద్దీని క్యాష్ చేసుకోవడానికి ఏపీ ఆర్టీసీ ఏకంగా ధరలను రెట్టింపు చేసింది. వెళ్లేటప్పుడు ఖాళీగా వెళుతున్న బస్సుల ఖర్చును భరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.

అదే తెలంగాణ ఆర్టీసీ మాత్రం వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు ప్రయాణికులు ఉండడంతో ధరలను పెంచకుండానే ప్రత్యేక బస్సులను కేటాయించింది. దీంతో ఏపీ బస్సుల్లో వెళితే  భారంగా.. తెలంగాణ బస్సుల్లో ఆ రేటు చౌకగా ఉండడంతో ఏపీ ప్రయాణికులు సైతం తెలంగాణ బస్సుల్లోనే వెళుతున్నారు.  తద్వారా ఆదాయం ఏపీకి నష్టం జరుగుతుంటే.. తెలంగాణకు ఇబ్బడిముబ్బడిగా వచ్చేస్తోందట.. ఈ తీరు చూసి రేట్లు పెంచి తప్పు చేశామా? మొదటికే మోసం అయ్యిందే అన్న ఆందోళన ఏపీ ఆర్టీసీ వర్గాల్లో వ్యక్తమవుతోందట..

ఏపీ, తెలంగాణ విడిపోయాక హైదరాబాద్ కు విజయవాడ, విశాఖ సహా వివిధ ప్రాంతాల నుంచే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులే వచ్చేవి. కానీ తెలంగాణ ఆర్టీసీ దీన్ని వ్యతిరేకించి 50-50 బస్సులు నడిపేలా ఒప్పందం చేసుకుంది. సో ఏపీ సగం బస్సులు ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తుండగా.. తెలంగాణ బస్సుల్లో రిజర్వేషన్లు ఫుల్లుగా అవుతున్నాయట..

ఏపీ ఆర్టీసీ రేటు పెంచి దెబ్బైపోయిందని.. తెలంగాణ ఆర్టీసీ పెంచకుండా క్యాష్ చేసుకుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇంత ఆదాయ నష్టం అవుతున్నా ఏపీ ఆర్టీసీ మాత్రం ధరలు తగ్గించేది లేదని స్పష్టం చేస్తోందట..