https://oktelugu.com/

Thaman Corona Positive: థమన్ కి కరోనా పాజిటివ్.. ఇండస్ట్రీని కబళిస్తున్న కరోనా !

Thaman Corona Positive: సినిమా ఇండస్ట్రీలో కరోనా మూడో వేవ్ కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. ఈ రోజు, సంచలనాత్మక సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ కూడా కరోనా బారిన పడ్డాడు. తనకు కోవిడ్ -19 పాజిటివ్ అని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం థమన్ ఐసోలేషన్‌లో ఉన్నాడు. అతి త్వరలో తిరిగి సంగీతం లోకంలో వస్తాను అంటూ ప్రస్తుతం థమన్ అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే, ప్రస్తుతం విజయవంతమైన సంగీత దర్శకుడిగా థమన్ ఖాతాలో […]

Written By:
  • Shiva
  • , Updated On : January 7, 2022 / 02:02 PM IST
    Follow us on

    Thaman Corona Positive: సినిమా ఇండస్ట్రీలో కరోనా మూడో వేవ్ కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. ఈ రోజు, సంచలనాత్మక సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ కూడా కరోనా బారిన పడ్డాడు. తనకు కోవిడ్ -19 పాజిటివ్ అని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం థమన్ ఐసోలేషన్‌లో ఉన్నాడు. అతి త్వరలో తిరిగి సంగీతం లోకంలో వస్తాను అంటూ ప్రస్తుతం థమన్ అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

    Thaman Corona Positive

    అయితే, ప్రస్తుతం విజయవంతమైన సంగీత దర్శకుడిగా థమన్ ఖాతాలో భారీ క్రేజీ ప్రాజెక్ట్‌ లు ఉన్నాయి. అందుకే థమన్ కి కరోనా పాజిటివ్ అని తెలియగానే తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ కి టెన్షన్ మొదలైంది. శివ కార్తికేయన్, నవీన్ పోలిశెట్టి మరియు దర్శకుడు అనుదీప్‌లను రెండు రోజుల క్రితం థమన్ ప్రత్యేకంగా కలిశాడు. ఇప్పుడు వాళ్ళు కూడా ఐసోలేషన్‌ లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

    అసలు కరోనా మూడో వేవ్ ఇంత వేగంగా వ్యాప్తి చెందుతుందని ఎవ్వరూ ఊహించలేదు. వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా నటీనటులకు వరుసగా కరోనా పాజిటివ్ వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. క‌రోనా వైర‌స్ బారిన ప‌డుతున్న సెల‌బ్రిటీల జాబితా కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఏం చేయాలో తెలియక సినిమా మేకర్స్ మళ్ళీ ఆందోళన బాట పట్టారు.

    Also Read: మన స్టార్ హీరోల్లో ఉన్న మంచి గుణం ఏంటో తెలుసా?

    ఇక తనకు కరోనా వచ్చిన సంగతి థమన్ తెలియజేస్తూ ‘డాక్టర్లు ఇచ్చిన సూచనలు పాటిస్తున్నాను. నాకు కరోనా పాజిటివ్ రావడం దురదృష్టకరం. దయచేసి అందరూ మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండండి’ అని థమన్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి కరోనా భయం మళ్ళీ మొదలైంది. ప్రస్తుతం కరోనా సోకినా సినీ ప్రముఖుల లిస్ట్ భారీగానే ఉంది.

    మంచు లక్ష్మి, మహేష్ బాబు, మంచు మనోజ్, విశ్వక్ సేన్, థమన్, మీనా ఇలా చాలామంది ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో కరోనా మూడో వేవ్ కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. దాంతో సడెన్ గా షూటింగ్స్ కూడా ఆపుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే, చాలా సినిమాలు మధ్యలోనే షెడ్యూల్స్ ను క్యాన్సిల్ చేసుకున్నాయి. ఇలాగే కేసులు పెరిగితే.. లాక్ డౌన్ పెట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

    Also Read: రవితేజను వెంటాడుతున్న బాలకృష్ణ… ఉద్దేశపూర్వకంగానా? లేక యాదృచ్చికమా?

    Tags