https://oktelugu.com/

కరోనా ఎఫెక్ట్.. ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..

తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతోన్నారు. శుక్రవారం ఒక్కరోజు తెలంగాణలో 499 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇన్ని కేసులు ఒకే రోజులో నమోదుకావడం ఇదే తొలిసారి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 329కేసులు నమోదవడం గమనార్హం. రాష్ట్రంలో మొత్తంగా ఇప్పటివరకు 6,526కరోనా కేసులు నమోదుకాగా 198కరోనాతో మృతిచెందారు. అయితే ప్రభుత్వం కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టిన కంట్రోల్ కావడంలేదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కేసీఆర్ కరుణిస్తాడా? […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 20, 2020 8:26 pm
    Follow us on


    తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతోన్నారు. శుక్రవారం ఒక్కరోజు తెలంగాణలో 499 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇన్ని కేసులు ఒకే రోజులో నమోదుకావడం ఇదే తొలిసారి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 329కేసులు నమోదవడం గమనార్హం. రాష్ట్రంలో మొత్తంగా ఇప్పటివరకు 6,526కరోనా కేసులు నమోదుకాగా 198కరోనాతో మృతిచెందారు. అయితే ప్రభుత్వం కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టిన కంట్రోల్ కావడంలేదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

    కేసీఆర్ కరుణిస్తాడా? కాలదన్నుతాడా?

    దీంతో ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో 50వేలమందికి కరోనా టెస్టులు చేసేందుకు రెడీ అయింది. దీంతో కరోనా కేసులు మరింత ఎక్కువగా నమోదవడం ఖాయంగా కన్పిస్తుంది. అదేవిధంగా ప్రయివేట్ ఆస్పతుల్లో కరోనా టెస్టులను చేసేందుకు అనుమతినిచ్చింది. అయినప్పటికీ రోజురోజుకు రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా కట్టడిలో విషయంలో మరిన్ని కఠిన చర్యలను చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈమేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు వారానికి 50 శాతం మంది చొప్పున ఆఫీసులకు హాజరు కావాలని సూచించింది.

    లాక్డౌన్ సడలింపుల నేథ్యంలో ఇటీవల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిస్థాయిలో విధులకు హాజరవుతున్నాయి. కాగా మరోసారి కరోనా కేసులు రాష్ట్రంలో విజృంభిస్తుండటంతో ప్రభుత్వం ఉద్యోగులకు పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో భాగంగా 50శాతం మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరు కావాలని సూచించింది. ఒక వారం సగం మంది హాజరైతే మరో వారం మిగతా సగం మంది విధుల్లో పాల్గొనాలని పేర్కొంది. సోమవారం నుంచి జూలై 4వరకు ఈ మార్గదర్శకాలను ఉద్యోగులు పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. విధుల్లోలేని ఉద్యోగులు హెడ్ క్వార్టర్స్‌ను వదలి వెళ్లొద్దని సూచించింది.

    కనుమరుగు కథ.. కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు అదే!

    అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఉన్న ఉద్యోగులు సెలవులు పెట్టుకోవాలని సూచించింది. లిఫ్ట్‌లో ముగ్గురి కంటే ఎక్కువ మంది వెళ్లొద్దని, ఏసీలు వాడకపోవడం మంచిదని సూచించింది. అవసరమైతే లిఫ్టులను ఉపయోగించుకోవాలని పేర్కొంది. అధికారుల డ్రైవర్లు పార్కింగ్ ఏరియాలో కాకుండా పేషీలో ఉండాలని ప్రభుత్వం సూచించింది. గతంలోనూ ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో ఇలాంటి చర్యలను చేపట్టింది. కొన్నిరోజులు కరోనా కేసులు తగ్గముఖం పట్టినట్లు కన్పించింది.

    అయితే ఇటీవల లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో మరోసారి రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సర్కార్ మరోసారి సగం మంది ఉద్యోగులే కార్యాలయాల్లో విధులు నిర్వహించాలని తాజాగా ఉత్వర్వులు ఇచ్చింది. అయితే ఈ చర్యల వల్ల కరోనా ఏమాత్రం కట్టడి అవుతుందనేది సందేహాలు వ్యక్తమవుతోన్నాయి.

    కరోనా విషయంలో సర్కార్ తొలినాళ్లలో చేసిన నిర్లక్ష్యంగా కారణంగానే రాష్ట్రంలో పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతోన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేత్రస్థాయిలోకి దిగితేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని పలువురు అంటున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..!