https://oktelugu.com/

‘పది’ పరీక్షలపై ఏపీ నిర్ణయం ఇదే..!

ఏపీలో పదవ తరగతి, ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాపితో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు ఇప్పటికే పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు గ్రేడ్‌లు ఇచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కూడా పదవ తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 20, 2020 / 07:48 PM IST
    Follow us on


    ఏపీలో పదవ తరగతి, ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాపితో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు ఇప్పటికే పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు గ్రేడ్‌లు ఇచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కూడా పదవ తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేయనున్నట్లు ప్రకటించింది.

    కేసీఆర్ కరుణిస్తాడా? కాలదన్నుతాడా?

    తొలుత పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఇందుకు అన్ని ఏర్పాటు చేసింది. వచ్చేనెల 10వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. కరోనా ఉధృతి తగ్గుతుందని భావించినా… పెరుగుతూ ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో జనసేన, బీజేపీ, టీడీపీ, వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. రెండు రోజులుగా ఉన్నతాధికారులు సమావేశమై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలు నిర్వహించారు.

    కనుమరుగు కథ.. కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు అదే!

    మరోవైపు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిములపు సురేష్ విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పరీక్ష హాల్ టిక్కెట్ ఉన్నవారందరునీ అప్ గ్రేడ్ చేయనున్నట్లు చెప్పారు. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలలో ఫెయిల్ అయిన వారందరినీ సప్లిమెంటరీ పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు. వారి మార్కుల లిస్టులో సప్లిమెంటరీ అని రాయడం జరుగుతుందని స్పష్టం చేశారు.