మరోసారి నోటికి పని చెప్పిన మంత్రి

తప్పుడు ప్రచారం చేస్తే చంద్రబాబు బట్టలు ఊడదీయాల్సి వస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు(నాని) అన్నారు. కరోనా వైరస్ కు భయపడి చంద్రబాబు ఇంట్లో దాక్కున్నారని ఎద్దేవ చేశారు. తాడేపల్లిలోని వై.సి.పి ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబులా సీఎం జగన్మోహన్ రెడ్డి దాక్కోలేదన్నారు. వయస్సు పై బడి చస్తాననే భయంతో చంద్రబాబు ఆక్సిజన్ పెట్టుకొని బతుకుతున్నాడని విమర్శించారు. ఈ విపత్కర పరిస్దితులలో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవుపలికారు. రాష్ట్రంలో ఎల్లో వైరస్ […]

Written By: Neelambaram, Updated On : March 31, 2020 7:25 pm
Follow us on

తప్పుడు ప్రచారం చేస్తే చంద్రబాబు బట్టలు ఊడదీయాల్సి వస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు(నాని) అన్నారు. కరోనా వైరస్ కు భయపడి చంద్రబాబు ఇంట్లో దాక్కున్నారని ఎద్దేవ చేశారు. తాడేపల్లిలోని వై.సి.పి ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబులా సీఎం జగన్మోహన్ రెడ్డి దాక్కోలేదన్నారు.

వయస్సు పై బడి చస్తాననే భయంతో చంద్రబాబు ఆక్సిజన్ పెట్టుకొని బతుకుతున్నాడని విమర్శించారు. ఈ విపత్కర పరిస్దితులలో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవుపలికారు. రాష్ట్రంలో ఎల్లో వైరస్ ఉంది. కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైనది ఎల్లో వైరస్ అని చెప్పారు. ఎల్లో వైరస్ కోరలు పీకే మందు మాదగ్గర ఉందన్నారు. కరోనా నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా వైయస్ సీఎం జగన్ పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబులా ప్రచార పిచ్చి జగన్ కు లేదన్నారు. అందరికి రేషన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని చెప్పారు.
రేషన్ షాపుల వద్ద జనం గుంపులు గుంపులుగా ఉండకూడదన్నారు.ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉచితంగా సరుకులు సరఫరా చేస్తున్నామని తెలిపారు.

వేలిముద్ర లేకుండా నిత్యావసర వస్తువులు ఇస్తున్నామని, గంటకు 20 నుంచి 25 మందికి మాత్రమే రేషన్ ఇవ్వగలుగుతున్నాం అన్నారు. ప్రతి ఒక్క వినియోగదారునికి సరుకులు అందిస్తామని ఏఒక్కరు ఆందోళన చెందనవసరం లేదని చెప్పారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా సరుకులు ఇవ్వాలని కొందరు అడుగుతున్నారని, గతంలో వాళ్ళే వాలంటరీ వ్యవస్థ ను హేళన చేసిన నిష్టదరిద్రులని చెప్పుకొచ్చారు. వాలంటీర్లు అమ్మాయిలను ఏడిపిస్తారని విమర్శలు చేశారన్నారు.

కరోనా నియంత్రణపై వాలంటీర్లు సైనికుల్లా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. వాలంటీర్లు ఒకరి ఇంటికి తరువాత మరొక ఇంటికి వెళ్లి ఇస్తే కరోనా వలన ఇబ్బంది అవుతుందని ఆ విధానం అవలంభించడం లేదన్నారు. ప్రస్తుతం వాలంటీర్లు ఖాళీగా లేరని, నిత్యం ప్రజల ఆరోగ్యాల గురించి పనిచేస్తున్నారన్నారు. విదేశాల నుంచి వచ్చింది ఎవరు అని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారని చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థను అభినందించారు. చంద్రబాబు ఊర కుక్కలు మహిళ రేషన్ కోసం వచ్చి చనిపోయిందని మొరుగుతున్నాయని, ఇందులో వాస్తవం లేదన్నారు. పనికిమాలిన దేవినేని ఉమా, సోదిరెడ్డి సోమిరెడ్డి ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వదిన ను చంపిన దేవినేని ఉమాకు నన్ను రాజీనామా చేయమని అడిగే హక్కు లేదన్నారు. ఈ నెల రేషన్ తీసుకోకపోతే వచ్చే నెల ఇచ్చే విషయం సీఎం గారితో చర్చిస్తానని చెప్పారు.