‘భయం చాలా చెడ్డది’. అదే ప్రాణాలను తీస్తుంది.. ఒక్కసారి ధైర్యంగా ఉన్నామా? ప్రపంచం మొత్తం అంతమై నువ్వొక్కడివే మిగిలినా సరే నీ ప్రాణం పోదు.. పోరాడగలవు. ధైర్యమే మనకు శ్రీరామ రక్ష.
మా స్నేహితుడు ఒకడు.. బాగా కండలు తిరిగిన వ్యక్తి.. రోజూ ఉదయం సాయంత్రం ఎక్సర్ సైజ్ చేస్తాడు.. మంచి దేహధారుడ్యం ఉన్న మనిషి. రోగాలు ఏం లేవు. యోగా కూడా చేస్తాడు. అయితే సడెన్ గా ఇటీవల కరోనా సోకింది.. నిండా 35 ఏళ్లు కూడా నిండని ఆ వ్యక్తి కరోనాను తట్టుకొని నిలబడే వాడే.. కానీ ఆ పిరికి భయంతోనే చనిపోయాడు. గుండె బరువెక్కి ఆందోళన చెంది కరోనా టైంలోనే ప్రాణం విడిచాడు.
హాలీవుడ్ లో ఒక సినిమా వచ్చింది.. ‘ఐయామ్ లెజెండ్’.. యాక్షన్ హీరో విల్ స్మిత్ నటించిన ఈ మూవీని ఈ సమయంలో ఖచ్చితంగా చూడండి.. ప్రపంచ మొత్తం ఒక వైరస్ ధాటికి అంతమైతే హీరో విల్ స్మిత్ తోపాటు ఒక కుక్క మాత్రమే ఈ భూప్రపంచంలో మిగులుతుంది. వారిద్దరూ ఎలా బతికారన్నది అసలు సినిమా కథ. ఇదో అద్భుతమైన స్ఫూర్తినిచ్చే కథ. గుండె దైర్యం మనిషికి ఎంత ఉండాలో ఈ సినిమా కళ్లకు కడుతుంది. ఎవరూ లేని భూప్రపంచంపై ఎలా బతుకవచ్చో ఒక మనిషికి ఎంత ధైర్యం కావాలో సినిమా చూస్తే తెలుస్తుంది. అది ఆల్ టైమ్ ఫేవరేట్ సినిమా అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. కరోనా మొదటి వేవ్ ను తట్టుకున్నాం. కానీ రెండో వేవ్ వచ్చింది. మళ్లీ ఉద్యోగ, ఉపాధి పోయి అల్లకల్లోలంగా మునుషులున్నారు.. అంతేకాదు.. ఇప్పుడు ఉద్యోగాలు పోతాయని భయంతో ఉన్నవారున్నారు.. ఇక కరోనా సోకుతుందని.. ప్రాణాలు పోతాయని మరికొందరు గజగజ వణికిపోతున్నారు. ఇలాంటి వారందరూ హాలీవుడ్ లో వచ్చిన ‘ఐయామ్ లెజెండ్’ మూవీని ఖచ్చితంగా చూడాల్సిందే. అందరికీ ఖాళీ టైం బాగానే ఉంది కాబట్టి తప్పక చూడండి ఎందుకంటే ఆ కథకు.. ఈ కరోనా కు దగ్గరి సంబంధాలున్నాయి.
*పిరికితనమే కరోనాకు విలన్
కరోనాను అందరూ ఎదుర్కోవచ్చు. అదేం ప్రాణాలు తీసే వ్యాధి కాదు.. కేవలం అంటువ్యాధి. ఖచ్చితంగా దానిపై పోరాడితే మనమే గెలుస్తాం. కానీ భయంతో బిగుసుకుపోతే అది ప్రాణాలు తీస్తుంది. పిరికితనమే కరోనాకు విలన్. అందుకే కరోనా సోకినా ధైర్యంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
*యాంటీ బయోటిక్, వైరల్ తో గుండె పోటులు
కరోనా వచ్చిందని.. ఏదో అయిపోతుందని డాక్టర్ చెప్పినా చెప్పకపోయినా యాంటీ బయోటిక్ లు, యాంటీ వైరల్ లు తీసుకుంటే అది గుండెకు చేటు అని.. ఆ భయం కంగారుతో ఓవర్ డోస్ అయ్యి గుండె ఆగిపోవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎంత బాగున్నా కూడా అధిక మోతాదులో వాడితే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. యాంటి బయాటిక్ లు వాడడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ తో చనిపోతున్నారని తాజాగా పరిశోధనలో తేల్చారు.
-ఇంట్లోనే ధైర్యంగా ఉండండి.. చికిత్స తీసుకోండి
భయంతోనే చాలా మంది రోగ నిరోధక శక్తిని కోల్పోయి కంగారు పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కరోనాను ఇంట్లోనే మందులు వాడుతూ జాగ్రత్తలు తీసుకొని జయించవచ్చని చాలా మంది నిరూపించారు. కరోనా మన ఊపిరితిత్తులనే టార్గెట్ చేస్తుంది. దానికి వేడి ఆవిరిని పట్టించండి. జిందా తిలస్మాత్ లేదా.. విక్స్ లాంటి మందులను వేడి నీటిలో వేసుకొని ఆ ఆవిరి పిల్చుతూ ఉంటే అసలు కరోనా పారిపోతుందని వైద్యులు చెబుతున్నారు. కరోనా నివారణ మందులు సరిగ్గా వాడుతూ డాక్టర్లు చెప్పినట్లు చేస్తే ఇంట్లోనే జయించవచ్చని అంటున్నారు.
– ఆక్సిజన్ కొరత.. భయోత్పాత వాతావరణం..
దేశంలో ఇప్పుడు ఆక్సిజన్ కొరత నెలకొంది. సింగపూర్ దేశం నుంచి యుద్ధ విమానాల్లో ఆక్సిజన్ ట్యాంకులను తీసుకొచ్చి దేశంలో సరఫరా చేస్తోంది మోడీ సర్కార్. నిజానికి ఆక్సిజన్ కొరత ఉండేది కానీ.. కరోనా రాగానే భయంతో చాలామంది ఆక్సిజన్ వాడేస్తున్నారు. తమకు శ్వాస ఆడినా ప్రాణభయంతో సిలిండర్లు తెప్పించుకొని పీలుస్తూ అసలైన రోగులకు అందకుండా చేస్తున్నారు. వారి ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నారు. 100 మంది కరోనా రోగుల్లో ఆక్సిజన్ అవసరం అయ్యే వారు 20కి మించరు. కానీ అందరూ వాడేసరికి కొరత ఏర్పడి ఆక్సిజన్ డిమాండ్ కు సరిపడా అందక అర్హులైన వారి ప్రాణాలు పోతున్నాయి.
-కరోనా అనేది చిన్న వైరస్.. భయమే ఎక్కువగా చంపేస్తోంది
కరోనా ఒక అంటువ్యాధి. ఒకప్పుడు తుమ్ములు.. దగ్గులు ముట్టుకుంటే వచ్చేది కానీ నేడు గాలి ద్వారా సంక్రమిస్తోంది. సెకండ్ వేవ్ లో ప్రజల నిర్లక్ష్యమే ఈ ఉత్పాతానికి కారణం. కరోనా అనేది పెద్దగా ప్రాణాలు తీసే వైరస్ కాదు. కానీ దానికి భయపడి మనమే ప్రాణాలు తీసుకుంటున్నాం. ఇందులో భయమే చాలా మందిని చంపేస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికీ కూడా కరోనాతో చనిపోయేది తక్కువ మందియే. లక్షల్లో కేసులు నమోదవుతున్నా.. చావులు రెండు, మూడు వేలు మాత్రమే ఉంటున్నాయి. అదీ దీర్గకాలిక వ్యాధులైన షుగర్, బీపీ, ఇతర అవయవలోపాలున్న వారే చనిపోతున్నారు. రికవరీలు ఎక్కువగా ఉంటున్నాయి. చాలా మంది కోలుకొని ఇంటికి వస్తున్నారు. అందుకే భయమే చంపేస్తోందని.. అందరూ మనో నిబ్బరంగా ఉంటే కరోనా మనల్ని ఏం చేయలేదని నిపుణులు భరోసానిస్తున్నారు..
-నరేశ్ ఎన్నం