Counterfeit Currency: పెద్దనోట్ల రద్దు.. విఫల ప్రయత్నమే.. ఆరేళ్ల తర్వాత కూడా ఫలితమివ్వడి డీమానిటైజేషన్‌!

Counterfeit Currency: ఆరేళ్ల క్రితం కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయం పెద్ద నోట్ల రద్దు. దీని వలన నకిలీ కరెన్సీ తగ్గుతుందని, అక్రమంగా విదేశాల్లో దాచుకున్న డబ్బు బయటకు వస్తుందని, అసాంఘిక శక్తులకు ఆర్థికసాయం నిలిచిపోతుందని ప్రధాని నరేంద్రమోడీ డీమానిటైజేషన్‌ సందర్భంగా ప్రకటించారు. అప్పడు చెలామనిలో ఉన్న రూ.1000, రూ.500 నోట్లు రద్దు చేశారు. రూ.2 నోట్లు ముద్రించారు. దీంతో చిల్లర సమస్య తలెత్తింది. అయితే ఆరేళ్లు గడిచినా డీమానిటైజేషన్‌ లక్ష్యం నెరవేరలేదు. పైగా నకిలీ నోట్ల […]

Written By: Raghava Rao Gara, Updated On : May 31, 2022 6:27 pm
Follow us on

Counterfeit Currency: ఆరేళ్ల క్రితం కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయం పెద్ద నోట్ల రద్దు. దీని వలన నకిలీ కరెన్సీ తగ్గుతుందని, అక్రమంగా విదేశాల్లో దాచుకున్న డబ్బు బయటకు వస్తుందని, అసాంఘిక శక్తులకు ఆర్థికసాయం నిలిచిపోతుందని ప్రధాని నరేంద్రమోడీ డీమానిటైజేషన్‌ సందర్భంగా ప్రకటించారు. అప్పడు చెలామనిలో ఉన్న రూ.1000, రూ.500 నోట్లు రద్దు చేశారు. రూ.2 నోట్లు ముద్రించారు. దీంతో చిల్లర సమస్య తలెత్తింది. అయితే ఆరేళ్లు గడిచినా డీమానిటైజేషన్‌ లక్ష్యం నెరవేరలేదు. పైగా నకిలీ నోట్ల బెడద అంతకంతకూ పెరుగుతోంది. అంతగా కనిపించకుండా పోయిన 2 వేల రూపాయల పెద్దనోట్లే కాదు… ప్రజలు విస్తృతంగా ఉపయోగిస్తున్న 500 రూపాయల నోట్లలో కూడా పెద్ద ఎత్తున నకిలీవి చెలామణి అవుతున్నాయి.

Counterfeit Currency

2016లో రాత్రికి రాత్రి నిర్ణయం…
2016లో ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో నకిలీ నోట్లకు అడ్డుకట్టవేయడం, బ్లాక్‌ మనీని వెలికి తీయడం, అవినీతి అంతం చేయడమే లక్ష్యమని ప్రకటించారు. డీమానిటైజేషన్‌ జరిగిన ఆరేళ్ల తర్వాతయినా అనుకున్న లక్ష్యం నెరవేరిందా..? దేశంలో నకిలీ నోట్ల చలామణీ ఆగిందాం? మన చేతికొచ్చేనోట్లన్నీ ఆర్‌బీఐ అధికారికంగా ముద్రించినవేనా..?అంటే వచ్చే సమాధానం కానే కాదని. పెద్ద నోట్ల రద్దు అసలు ఉద్దేశం నెరవేరకపోగా.. మరింతగా నకిలీ నోట్లు దేశంలో చేతులు మారుతున్నా యి.

Also Read: Hero Nitin Becoming A Father: తండ్రి కాబోతున్న హీరో నితిన్

చేతులు మారుతున్న ఫేక్‌ కరెన్సీ..
దేశంలో నకిలీ నోట్ల బెడద అంతకంతకూ పెరుగుతోంది. అంతగా కనిపించకుండా పోయిన 2వేల రూపాయల పెద్దనోట్లతోపాటు విస్తృతంగా ఉపయోగిస్తున్న 500 రూపాయల నోట్లలో కూడా పెద్ద ఎత్తున నకిలీవి ఉంటున్నాయి. ఇవి ప్రతిపక్షాలో, ప్రభుత్వ వ్యతిరేకులో చేసిన ఆరోపణలు, విమర్శలు కాదు. స్వయంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లెక్కలతో సహా వెల్లడించిన వివరాలు. ఇవే ఇప్పుడు ప్రతిపక్షాలకు ప్రధాన అస్త్రంగా మారాయి.

Counterfeit Currency

దడ పుట్టిస్తున్న నకిలీ నోట్ల చలామణి..
ఆర్‌బీఐ నివేదిక ప్రకారం అన్ని రకాల నకిలీ నోట్లు పెరిగాయి. 500 రూపాయల నకిలీ నోట్లు ముందు ఏడాదితో పోలిస్తే 2021–22 ఆర్థిక సంవత్సరంలో 101.9 శాతం పెరిగాయని, రెండువేల రూపాయల నకిలీ నోట్లు 55 శాతం పెరిగాయని ఆర్‌బీఐ తెలిపింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశంలో నకిలీనోట్ల చలామణి బాగా తగ్గింది. ఏడాది కాలంలో మళ్లీ ఫేక్‌ నోట్లు ఇంత విస్తృతంగా ఎలా వాడకంలోకి వచ్చాయన్నది అర్ధం కావడం లేదు. 6.9 శాతం నకిలీనోట్లను ఆర్‌బీఐ గుర్తించగా, 93.1 శాతం నోట్లను ఇతర బ్యాంకులు గుర్తించాయి. 2017–18లో 500 రూపాయల నకిలీ నోట్లు 9, 892 ఉండగా, 2000 రూపాయల నోట్లు 17,0 29 ఉండేది. 2021–22 నాటికి 500 రూపాయల నకిలీ నోట్లు 79, 669 చలామణీ అవుతున్నాయి. 2 వేల రూపాయల నోట్లు 13,604 నోట్లు చలామణి అవుతన్నాయి.

ఇలా గుర్తించొచ్చు..
500 నకిలీది కాదని గుర్తించాలంటే లైట్‌ షేడ్‌ పడినప్పుడు నోటుపై కొన్ని చోట్ల 500 అని రాసి ఉంటుంది. అలాగే నోటుపై దేవనాగర లిపిలో 500 అని రాసి ఉంటుంది. మహాత్మాగాంధీ పొటో కుడివైపు ఉంటుంది. నోటుపై ఇండియా అని రాసి ఉంటుంది. నోటును వంచినప్పడు రంగు ఆకుపచ్చ నుంచి ఇండిగోకు మారుతుంది. గవర్నర్‌ సంతకం, గ్యారంటీ, ప్రామిస్‌ క్లాజ్, ఆర్‌బీఐ చిహ్నం కరెన్సీ నోటు కుడివైపు ఉంటాయి. ఎలక్ట్రోటైప్‌ వాటర్‌ మార్క్‌ ఉంటుంది. 500 అని రాసి ఉన్న రంగు ఆకుపచ్చ నుంచి బ్లూకు మారుతుంది. అశోకస్తంభం కరెన్సీ నోటు కుడివైఉ ఉంటుంది. స్వచ్ఛ భారత్‌ లోగో, నినాదం రాసి ఉంటాయి.

Also Read:Karate Kalyani: ప్చ్.. వాళ్ళను బాగా పిండేస్తోంది.. కేసుల మీద కేసులు

Recommended Videos:


Tags