పది నిముషాల్లో కోవిడ్ టెస్ట్!

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అనుమానితులు స్వాబ్ టెస్టులు చేయాల్సి ఉన్నా పరీక్షా కేంద్రాలు ఏడు మాత్రమే ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కో పరీక్షా కేంద్రంలో 300 చొప్పున రోజుకు 2,100 నమునాలనే పరీక్షించిన గలుగుతున్నారు. స్వాబ్ టెస్టింగ్ సంఖ్యను పెంచాలని భవించాన ప్రభుత్వం ర్యాపిడ్ టెస్ట్ కిట్ల దిగుమతికి చేపట్టిన చర్యలు సత్పలితాన్ని ఇచ్చాయి. దీంతో దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్‌ టెస్టు కిట్లు రాష్ట్రానికి చేరుకున్నాయి. సియోల్‌ నుంచి ప్రత్యేక చార్టర్‌ […]

Written By: Neelambaram, Updated On : April 17, 2020 4:58 pm
Follow us on


రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అనుమానితులు స్వాబ్ టెస్టులు చేయాల్సి ఉన్నా పరీక్షా కేంద్రాలు ఏడు మాత్రమే ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కో పరీక్షా కేంద్రంలో 300 చొప్పున రోజుకు 2,100 నమునాలనే పరీక్షించిన గలుగుతున్నారు. స్వాబ్ టెస్టింగ్ సంఖ్యను పెంచాలని భవించాన ప్రభుత్వం ర్యాపిడ్ టెస్ట్ కిట్ల దిగుమతికి చేపట్టిన చర్యలు సత్పలితాన్ని ఇచ్చాయి. దీంతో దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్‌ టెస్టు కిట్లు రాష్ట్రానికి చేరుకున్నాయి. సియోల్‌ నుంచి ప్రత్యేక చార్టర్‌ విమానం ద్వారా గన్నవరం విమానాశ్రయానికి పంపించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెదేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో టెస్టు కిట్లను ప్రారంభించారు. సాధారణంగా 4 నుంచి 5 గంటలు పెట్టె ఈ స్వాబ్ టెస్టింగ్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ లతో కేవలం 10 నిముషాలలో పూర్తి చేయవచ్చని అధికారులు తెలిపారు. కమ్యూనిటీ టెస్టింగ్‌ కోసం ర్యాపిడ్‌ కిట్లను వినియోగిస్తామని చెబుతున్నారు. మూడవ విడత వాలంటీర్ల సర్వేలో అనుమానిత లక్షణాలు ఉన్న సుమారు 32 వేల మందికి ఈ కిట్ లతో టెస్టింగ్ చేయనున్నట్లు చెపుతున్నారు.

4 నుంచి 5 రోజుల్లో అన్ని జిల్లాలకు ఈ కిట్ లను పంపిస్తామని తెలిపారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రి బొత్స సత్యన్నారాయణ , సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు.