https://oktelugu.com/

సూర్యాపేటలో కరోనా విజృంభణ!

నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 50 కరోనా కేసులు నమోదు కాగా అందులో 16 కేసులు ఒక్క సూర్యాపేట జిల్లాలోనే నమోదయ్యాయి. ఈ రోజు(శుక్రవారం) ఉదయానికి 6 కరోనా కేసులు నమోదు కాగా అందులో 5 కేసులు సూర్యాపేట పట్టణంలోనే నమోదు కావడంతో సూర్యాపేట జిల్లాలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తాజా కేసులతో సూర్యాపేట జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 44కు చేరినట్లు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. దీంతో అప్రమత్తమమైన అధికారులు వైద్యసిబ్బంది […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 17, 2020 5:25 pm
    Follow us on

    నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 50 కరోనా కేసులు నమోదు కాగా అందులో 16 కేసులు ఒక్క సూర్యాపేట జిల్లాలోనే నమోదయ్యాయి. ఈ రోజు(శుక్రవారం) ఉదయానికి 6 కరోనా కేసులు నమోదు కాగా అందులో 5 కేసులు సూర్యాపేట పట్టణంలోనే నమోదు కావడంతో సూర్యాపేట జిల్లాలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తాజా కేసులతో సూర్యాపేట జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 44కు చేరినట్లు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.

    దీంతో అప్రమత్తమమైన అధికారులు వైద్యసిబ్బంది ఇంటింటి సర్వే చేస్తు అనుమానితులను గుర్తిస్తున్నారు. అంతేకాకా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి వారి స్వాప్‌ నమూనాలు పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు పంపుతున్నారు. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలలో భయాందోళనలు పెరిగాయి. జిల్లాలో మరింత కఠిన చర్యలకు పూనుకుంటున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. మూడు కంటైన్ ‌మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 56కు చేరింది. గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్ తర్వాత అత్యధిక కేసులు నమోదైన జిల్లాగా నమోదైంది.

    మరోవైపు జోగులాంబ గద్వాల జిల్లాలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 19కి చేరుకుంది. తాజా కేసులతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 706కు చేరుకుంది. తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం తగ్గినట్లే కనిపించినా.. మళ్లీ పంజా విసురుతుండటం ఆందోళన కల్గిస్తోంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 80 శాతానికి పైగా మర్కజ్ మూలాలున్నవే కావడం గమనార్హం.

    ప్రస్తుతం రాష్ట్రంలో 502 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 18 మంది మరణించారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న 68 మందిని గురువారం డిశ్చార్జ్ చేసినట్ల మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 178 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.