తెలుగులోనే ఆ టాప్ పత్రికను కరోనా షేక్ చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లోని దాని ప్రధాన కార్యాలయంలో చాలా మందికి కరోనా బారినపడ్డా పనులు ఆపలేదు ఆ సంస్థ. మొత్తం కార్యాలయం శానిటైజ్ చేయించి ఉద్యోగులు రావాలంటూ హుకూం జారీ చేసింది. అయితే ఇప్పుడు హెడ్ ఆఫీస్ వరకూ కరోనా వచ్చేసింది. ఇప్పుడు తన కోటలోని ప్రధాన కార్యాలయం మొత్తం కరోనా పాకేసిందని తెలిసింది. ఏపీ, తెలంగాణ సహా మొత్తం వ్యవహారాలన్నీ సాగే అందులో ఇప్పుడు కరోనా కల్లోలంగా మారిందని వార్తలు వస్తున్నాయి.
సచివాలయం కూల్చివేతకు.. కేటీఆర్ కు లింకేంటీ?
ఇప్పటికే తెలంగాణలోని హైదరాబాద్ లో కరోనా విస్తృతంగా వ్యాపిస్తోంది. ప్రముఖులు, సామాన్యులు, రాజకీయ నాయకులు, పోలీసులన్న తేడా లేకుండా విస్తరిస్తోంది. దాదాపు ప్రతీరోజు ఒక వీఐపీ, లేదా మరొక సెలెబ్రెటీ కి కరోనా వైరస్ సోకిందనే వార్తలను వింటున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఒక్క కరోనా బెడ్ దొరకడమే గగనంగా మారింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా జనాలు వెనుకాడడం లేదు.
తాజాగా ప్రసిద్ధ తెలుగు దినపత్రికలో ప్రముఖ కార్టూనిస్ట్ కు కూడా కరోనా వైరస్ బారిపడ్డాడట.. హైదరాబాద్ లోని ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. కోట లాంటి ఆ ఆఫీసులో చాలా మందికి కరోనా పాజిటివ్ గా తేలిందట.. ఆ పత్రిక సండే మ్యాగజైన్ లో మెజార్టీ మందికి కరోనా సోకిందని సమాచారం. వచ్చే వారం సండే మేగజైన్ రావడం కష్టమేనంటున్నారు.ఇక రెండు మూడు రోజులుగా ఈ ప్రముఖ కార్టూనిస్ట్ కార్టూన్ లు లేకుండానే ఆ పత్రిక వస్తోంది. మూడు దశాబ్ధాలకు పైగా ఆ పత్రికలో పనిచేస్తున్న ఆయన కార్టూన్లు లేకుండా పత్రిక రావడం ఇదే ప్రథమం. ఏమైందని ఆరాతీయగా ఆయనకు కరోనా సోకిందని తెలిసింది.
హైదరాబాద్ లోని తీవ్రత ఆ పత్రిక ప్రధాన కార్యాలయానికి పాకిందట.. దీంతో చాలా మందికి వైరస్ వ్యాపించినట్టు తెలిసింది. సండే మేగజైన్ సహా సినిమా, ఇతర సెక్షన్ల వారికి పాజిటివ్ గా తేలిందట..దీంతో ఆ పత్రికలో కరోనా కల్లోలం నెలకొందని సమాచారం. చాలా మంది క్వారంటైన్ కు పోవడంతో ఉన్నవారితోనే ప్రస్తుతానికి నెట్టుకొస్తున్నారట.. మరికొద్దిరోజులు పోతే పరిస్థితి ఎలా ఉంటుందోనని భయం భయంగా అందులోని జర్నలిస్టులు పనిచేస్తున్న పరిస్థితి నెలకొంది. కరోనా పరిస్థితి చూస్తుంటే మున్ముందు పత్రిక నడవడం కూడా కష్టమేనన్న భయం వ్యాపిస్తోందట..