https://oktelugu.com/

కాగితంలేని పాలనలో తొలి అడుగు ఎలా ఉండబోతోంది?

ఎంతో కాలంగా రాష్ట్రంలో కాగితం లేని పాలన అందని ద్రాక్షాగా మారింది. కరోనా విజృంభణ నేపథ్యంలో పేపర్‌ ఫైళ్లు ఉపయోగించే పాత పద్దతికి స్వస్తి చెప్పి కొత్త పద్దతులకు స్వాగతం పలకనున్నారు. ఇందులో భాగంగానే డిజిటల్‌ ఫైలింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుండితెలంగాణలో ఈ-పాలన అందుబాటులోకి రానున్నది. పాలన విధానాన్ని అమలులోకి తీసుకువచ్చిన తరువాత రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా… దాన్ని సీఎం కేసీఆర్…డిజిటల్ ఫార్మాట్‌ లో వీడియో కాన్ఫరెన్సుల ద్వారా చూస్తారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 11, 2020 / 06:00 PM IST
    Follow us on

    ఎంతో కాలంగా రాష్ట్రంలో కాగితం లేని పాలన అందని ద్రాక్షాగా మారింది. కరోనా విజృంభణ నేపథ్యంలో పేపర్‌ ఫైళ్లు ఉపయోగించే పాత పద్దతికి స్వస్తి చెప్పి కొత్త పద్దతులకు స్వాగతం పలకనున్నారు. ఇందులో భాగంగానే డిజిటల్‌ ఫైలింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుండితెలంగాణలో ఈ-పాలన అందుబాటులోకి రానున్నది.

    పాలన విధానాన్ని అమలులోకి తీసుకువచ్చిన తరువాత రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా… దాన్ని సీఎం కేసీఆర్…డిజిటల్ ఫార్మాట్‌ లో వీడియో కాన్ఫరెన్సుల ద్వారా చూస్తారు. అన్నింటికీ పక్కా ఆధారాలుంటాయి. పూర్తి పారదర్శకమైన పాలన రాబోతోంది. అదే విధంగా ప్రభుత్వ కార్యకలాపాలన్నీ పేపర్‌ తో పనిలేకుండా అంతా ఆన్‌ లైన్ రూపంలో జరుగుతాయి. చర్చలు, సమావేశాలన్నీ ఆన్‌ లైన్‌ లోనే ఏ ఫైలైనా… ఆన్‌ లైన్ పరమే.. ఏ నిర్ణయమైనా… డిజిటల్‌ లోనే. సంప్రదాయ సంతకాల స్థానంలో డిజిటల్ సిగ్నేచర్స్ ఉంటాయి.

    దీని వల్ల చాలా లాభాలున్నాయి. ఏ ఫైల్ ఏ అధికారి దగ్గర పెండింగ్ ఉందో తెలుసుకొని, సంబంధిత అధికారిని వెంటనే పని పూర్తి చెయ్యమని సీఎం ఆఫీస్ వర్గాలు కోరే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఏ ఫైల్ ఏ దశలో ఉందో క్షణాల్లో అది సెర్చ్ ఆప్షన్‌లో కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఇంట్లో ఉండి కూడా ఫైళ్లను ఆన్‌ లైన్‌ లో తెరచి చూసి ఓకే చెయ్యొచ్చు. అలాగే పనిలో కచ్చితత్వమూ ఉంటుంది. కాలయాపన తగ్గుతుంది.

    నీటి ప్రాజెక్టుల పనుల్లో అభివృద్ధి, ప్రభుత్వ సహాయ చర్యలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అన్ని అంశాల్నీ సీఎం కేసీఆర్ పరిశీలిస్తారు. ఈ క్రమంలోనే ప్రతి సోమవారం ప్రభుత్వం జిల్లా కలెక్టరేట్లలో డీడీఆర్సీ సమావేశాలు నిర్వహించనుంది. అలాగే శాఖల వారీగా ఐడీ, పాస్‌ వర్డ్‌ లను ఇవ్వనున్నారు. ఏ జిల్లాలో ఏ లోటుపాట్లున్నా వెంటనే వాటిని సరిచేస్తారు. అంతా ఆన్‌ లైన్ అయినప్పటికీ కేబినెట్ సమావేశాలు, తీసుకునే నిర్ణయాలపై మాత్రం సీక్రెసీ మెయింటేన్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

    తహశీల్దార్, ఎంపిడిఓ ఆర్డీఓ డిపిఓ ఇలా విభాగాలన్నీ ఆన్‌ లైన్‌ లోనే ఫైళ్లను చెక్ చేసి ఆమోదిస్తాయి. తద్వారా కలెక్టరేట్లు, మండల, డివిజన్, ఇతర ఆఫీసుల్లో ఈ-పాలన అమలవుతుంది. ప్రజలు పెట్టుకునే అర్జీలు, ప్రతిపాదనలన్నీ స్కాన్ అవుతాయి. సంబంధిత కలెక్టర్లేట్లకు ఆన్‌ లైన్‌ లో వెళ్తాయి. అంటే ప్రజలు ఇచ్చే అర్జీలు పేపర్ల రూపంలో ఉన్నా ప్రభుత్వం మాత్రం వాటిని ఆన్‌ లైన్ స్కానింగ్ ప్రతుల రూపంలోనే చూడనుంది. అలాగే ఫైళ్లను బార్ కోడింగ్ చేస్తారని తెలిసింది. పోలీస్ కమాండ్ కంట్రోల్ సిస్టం ద్వారా అన్ని జిల్లాలు, ఆఫీసుల్లో డిజిటల్ కాన్ఫరెన్సింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్‌ లో పాల్గొనేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్లను అప్‌ గ్రేడ్ చేస్తున్నారు.