https://oktelugu.com/

అమెరికాను వీడని కరోనా

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను ఓ ఆట ఆడేసుకుంది. అందులోనూ ముఖ్యంగా అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పట్టింపులేని తత్వంతో ఆ దేశం భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. అయితే.. అన్ని దేశాల్లో కరోనా కంట్రోల్‌లోకి వచ్చినా.. అమెరికాలో మాత్రం కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా బాగా పెరిగింది. గడిచిన 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 2.9 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. Also Read: గుడ్ న్యూస్: దేశంలో కరోనా టీకాల పంపిణీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 10, 2021 / 10:42 AM IST
    Follow us on


    కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను ఓ ఆట ఆడేసుకుంది. అందులోనూ ముఖ్యంగా అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పట్టింపులేని తత్వంతో ఆ దేశం భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. అయితే.. అన్ని దేశాల్లో కరోనా కంట్రోల్‌లోకి వచ్చినా.. అమెరికాలో మాత్రం కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా బాగా పెరిగింది. గడిచిన 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 2.9 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.

    Also Read: గుడ్ న్యూస్: దేశంలో కరోనా టీకాల పంపిణీ ఇప్పటినుంచే..

    యూఎస్‌లో శుక్రవారం మొత్తం 2,90,000 నమోదయ్యాయని జాన్ హోప్‌కిన్స్ యూనివర్సిటీ రియల్ టైమ్ గణాంకాలు వెల్లడించాయి. గురువారం 2.65 లక్షల కొత్త కేసులు నమోదు కాగా.. శుక్రవారం 2,90,000 నమోదయ్యాయి. గురువారం సుమారు 4 వేల మరణాలు సంభవించగా.. గడిచిన 24 గంటల్లో 3676 మరణాలు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి సృష్టించిన విలయంతో అమెరికా వ్యాప్తంగా అత్యంత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.

    అయితే.. మృతుల సంఖ్య పెరుగుతుండడంతో అక్కడి దేశంలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. శ్మశాన వాటికల్లో కనీసం చోటు కూడా దక్కని దుస్థితి దాపురించింది. కరోనా బారినపడ్డ జనం హాస్పిటళ్లకు క్యూ కట్టడంతో అవి కిక్కిరిసిపోయాయి. చాలా మందికి బెడ్స్, కనీస వైద్య సదుపాయాలు అందడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగిని అమెరికాకు ఈ దుస్థితి దాపురించడం అమెరికాతోపాటు ప్రపంచ దేశాలను ఆవేదనకు గురిచేస్తోంది.

    Also Read: ప్రతి సంవత్సరం 100 మంది సైనికులు ఆత్మహత్య.. కారణమేమిటంటే..?

    తాజాగా.. నమోదైన కేసులను కలుపుకుంటే.. అమెరికాలో ఇప్పటివరకు 2,24,61,696 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా కరోనాతో 3,78,204 మంది మృత్యువాతపడ్డారు. 1,32,59,949 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. అమెరికాలో యూకే రకం కరోనా వైరస్‌ కేసులు 52 నమోదయ్యాయి. పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఇందుకు సంబంధించి సూచనలు చేశారు. యూఎస్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను గతేడాది డిసెంబర్‌ మధ్యలోనే చేపట్టారు. ఇప్పటివరకు 6.6 మిలియన్ల మందికి తొలి ఇంజెక్షన్‌ను అందజేశారు. 22 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ కోసం రవాణా చేశారు.

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు

    Tags