115 దేశాల్లో కరోనా… 4,300 మంది మృతి

చైనాలో పుట్టిక కరోనా వైరస్ ప్రపంచంలోని 115 దేశాల్లో విస్తరించగా 4,300 మంది మృతి చెందారు. కరోనా బాధితుల సంఖ్య లక్షా 18వేలకు చేరింది. ఈయూ దేశాలన్నింటికీ విస్తరించిన కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంపై ఇటలీలో జన సంచారంపై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇటలీలో ఎవరైన ఆంక్షలను ఉల్లంఘిస్తే శిక్ష వేస్తామంటూ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇకపోతే.. దేశవ్యాప్తంగా నిన్నకి వరకు 14 కేసులు నమోదు కాగా.. ఇప్పటికి వరకు కరోనా వైరస్ బాధితుల […]

Written By: Neelambaram, Updated On : March 11, 2020 3:04 pm
Follow us on

చైనాలో పుట్టిక కరోనా వైరస్ ప్రపంచంలోని 115 దేశాల్లో విస్తరించగా 4,300 మంది మృతి చెందారు. కరోనా బాధితుల సంఖ్య లక్షా 18వేలకు చేరింది. ఈయూ దేశాలన్నింటికీ విస్తరించిన కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంపై ఇటలీలో జన సంచారంపై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇటలీలో ఎవరైన ఆంక్షలను ఉల్లంఘిస్తే శిక్ష వేస్తామంటూ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

ఇకపోతే.. దేశవ్యాప్తంగా నిన్నకి వరకు 14 కేసులు నమోదు కాగా.. ఇప్పటికి వరకు కరోనా వైరస్ బాధితుల సంఖ్య 61కి చేరింది. కేరళలో 14 కేసుులు, కర్ణాట, మహారాష్ట్రలో 3 చొప్పున కొత్త కేసులు నమోదు కాగా.. మన దేశంలో ఇప్పటి వరకు 56 కేసులు నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కేంద్రం కరోనా వైరస్ దృష్ట్యా ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశస్థుల రాకపై ఆంక్షలు విధిస్తూ.. రెగ్యులర్, ఈ- వీసాలను రద్దు చేసింది. చైనా, ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా, జపాన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది.

అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 24కు చేరగా.. ట్రంప్ కు కరోనా ఉందన్న వార్తలపై వైట్ హౌస్ స్పందించి ట్రంప్ ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోలేదన్న అధికారులు క్లారిటీ ఇచ్చారు.

కాగా, ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ వార్షిక జీడీపీ అంచనాలు 2.5 శాతం దిగువకు పడిపోయాయి. ఆర్థిక వ్యవస్థకు ఈ ఏడాది రూ.148 లక్షల కోట్ల (2 ట్రిలియన్‌ డాలర్లు) వరకు నష్టం వాటిల్లవచ్చని ఐక్యరాజ్య సమితి (యూఎన్‌) నిపుణుల అంచనా.

‘ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 2 శాతం మందగమనాన్ని మనం చూస్తామనిపిస్తున్నది’ అని ఐక్యరాజ్య సమితి వాణిజ్య, అభివృద్ధి విభాగంలో ప్రపంచీకరణ, అభివృద్ధి వ్యూహాల శాఖ డైరెక్టర్‌ రిచర్డ్‌ కోజుల్‌-రైట్‌ తెలిపారు.

భారత్‌కు 348 మిలియన్‌ డాలర్ల (రూ.2,569 కోట్లు) నష్టం రావచ్చని అంచనా వేస్తున్నది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థల్నీ కరోనా కుదిపేస్తుండటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పతనానికి సూచికేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు .