నామినేషన్‌ను అడ్డుకుంటే తీవ్రంగా పరిగణిస్తాం

రాష్ట్రంలో సమర్ధమైన పోలీసు యంత్రాంగం ఉందని.. ఫిర్యాదులను స్వీకరించేందుకు అధికారులను నియమించామని ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ వెల్లడించారు. ఎవరైనా నామినేషన్‌ను అడ్డుకుంటే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. పోటీచేసే అభ్యర్థులకు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టించవద్దని ఆయన రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలను స్వేచ్ఛగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పోటీ చేసే అభ్యర్తులకు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమోటోగా సంబంధించిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చెయ్యడం […]

Written By: Neelambaram, Updated On : March 11, 2020 2:44 pm
Follow us on

రాష్ట్రంలో సమర్ధమైన పోలీసు యంత్రాంగం ఉందని.. ఫిర్యాదులను స్వీకరించేందుకు అధికారులను నియమించామని ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ వెల్లడించారు. ఎవరైనా నామినేషన్‌ను అడ్డుకుంటే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు.

పోటీచేసే అభ్యర్థులకు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టించవద్దని ఆయన రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలను స్వేచ్ఛగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పోటీ చేసే అభ్యర్తులకు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమోటోగా సంబంధించిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చెయ్యడం జరిగిందని తెలిపారు.

చిత్తూరు జిల్లా సదుం మండలంలో జరిగిన ఘటనపై కేసు నమోదు చేశామని రమేశ్‌ వెల్లడించారు. నియమావళిని ఉల్లంఘించినట్టు ఎక్కడా ఫిర్యాదులు రాలేదని చెబుతూ చిత్తూరు జిల్లా ఘటన తమ దృష్టికి వచ్చినదని చెప్పారు. ఎన్నికల సమయంలో ఎవరు ఇబ్బంది కలిగించినా తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు.

సిబ్బందికి కొరత లేదని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్ఛారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి తమకు సహకారం ఉందని రమేశ్‌ తెలిపారు.