కరోనా వేవ్: మోడీ సంచలన నిర్ణయం

దేశమంతా కరోనా సెకండ్ వేవ్ తో అల్లకల్లోలంగా మారుతోంది. ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతున్నాయి. టీకాలు సరఫరా కాక ప్రజలందరూ ఎగబడుతున్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని నరేంద్రమోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజల కష్టాలు తీరేలా తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతున్న ఈ సమయంలో వైద్యపరంగా ప్రజలపై పడుతున్న పెను భారం అంతా ఇంతాకాదు.. ఈ క్రమంలోనే ఈ భారాన్ని తగ్గించేందుకు ప్రధాని మోడీ కొరత ఉన్న […]

Written By: NARESH, Updated On : April 24, 2021 5:36 pm
Follow us on

దేశమంతా కరోనా సెకండ్ వేవ్ తో అల్లకల్లోలంగా మారుతోంది. ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతున్నాయి. టీకాలు సరఫరా కాక ప్రజలందరూ ఎగబడుతున్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని నరేంద్రమోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజల కష్టాలు తీరేలా తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతున్న ఈ సమయంలో వైద్యపరంగా ప్రజలపై పడుతున్న పెను భారం అంతా ఇంతాకాదు.. ఈ క్రమంలోనే ఈ భారాన్ని తగ్గించేందుకు ప్రధాని మోడీ కొరత ఉన్న ఆక్సిజన్ తోపాటు విదేశీ టీకాల దిగుమతిపై కూడా కస్టమ్స్ డ్యూటీ, ఆరోగ్య సెస్ ను తక్షణమే మాఫీ చేస్తున్నట్టు శనివారం ప్రకటించారు.

దీంతో ఇక దేశంలోకి ఆక్సిజన్ సరఫరాను విదేశాల నుంచి చీప్ గా తీసుకొచ్చేందుకు.. అలాగే వివిధ దేశాల వ్యాక్సిన్లను తక్కువ ధరకు భారతీయులు పొందేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది.

దేశంలో నెలకొన్ని కోవిడ్ పరిస్థితులపై సమీక్షించిన ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి సమావేశం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల దేశంలో వైద్యపరంగా వస్తువుల లభ్యతను పెంచడంతోపాటు కారుచౌకగా లభించేలా మోడీ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు.

ఇప్పటికే దేశంలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు సింగపూర్ నుంచి యుద్ధ విమానాల్లో ఆక్సిజన్ ట్యాంకులను భారత ప్రభుత్వం తీసుకొస్తోంది. వాటిని దేశవ్యాప్తంగా కూడా ఇదే విమానాల్లో భారత వైమానిక దళం చేరవేస్తోంది. మోడీ సర్కార్ చూపిస్తున్న చొరవపై ప్రశంసలు కురుస్తున్నాయి.