చాన్నాళ్లకు తెలుగులో ఈషా రెబ్బాకు మరో చాన్స్?

ఈషా రెబ్బా. అచ్చ తెలుగు అమ్మాయి. అందం ఉంది. అభినయం ఉంది. స్టార్ హీరోయిన్‌కు కావాల్సిన అన్ని అర్హతలూ ఉన్నాయి. కానీ, సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. అయినా చిన్న, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా వచ్చిన ప్రతి ఆఫర్ను సద్వినియోగం చేసుకుంటోంది. తన ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. అయినప్పటికీ కెరీర్ను మలుపుతిప్పే బ్రేక్‌ కోసం ఈషా చాన్నాళ్ల నుంచి ఎదురు చూస్తూనే ఉంది. ‘బ్రాండ్ బాబు’, ‘సుబ్రమణ్యపురం’, ‘రాగల 24 గంటల్లో’ […]

Written By: Neelambaram, Updated On : June 14, 2020 4:22 pm
Follow us on


ఈషా రెబ్బా. అచ్చ తెలుగు అమ్మాయి. అందం ఉంది. అభినయం ఉంది. స్టార్ హీరోయిన్‌కు కావాల్సిన అన్ని అర్హతలూ ఉన్నాయి. కానీ, సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. అయినా చిన్న, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా వచ్చిన ప్రతి ఆఫర్ను సద్వినియోగం చేసుకుంటోంది. తన ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. అయినప్పటికీ కెరీర్ను మలుపుతిప్పే బ్రేక్‌ కోసం ఈషా చాన్నాళ్ల నుంచి ఎదురు చూస్తూనే ఉంది. ‘బ్రాండ్ బాబు’, ‘సుబ్రమణ్యపురం’, ‘రాగల 24 గంటల్లో’ సినిమాల్లో హీరోయిన్‌గా నటించినప్పటికీ ఆ రెండూ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ‘అరవింద సమేత వీర రాఘవ’లో ఓ పాత్ర పోషించింది. ఆ సినిమా హిట్టయినా.. ఈషాకు ఒరిగిందేమీ లేదు.

దాంతో ఇప్పుడామె తమిళ్‌తో పాటు కన్నడ సినిమాలపై దృష్టి పెట్టింది. జీవీ ప్రకాశ్ కుమార్ సరసన తమిళ్‌లో ఓ సినిమా చేస్తున్న ఆమె.. ‘ఎస్‌ఆర్కే’ అనే మూవీతో కన్నడలో అరంగేట్రం చేస్తోంది. మరోవైపు నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టించిన ‘లస్ట్‌ స్టోరీస్‌’ హిందీ వెబ్‌ సిరీస్‌ తెలుగు వెర్షన్‌లో కూడా ఈషా నటిస్తోంది. ఇప్పటిదాకా హోమ్లీ క్యారెక్టర్స్‌కే మొగ్గు చూపిన ఆమె.. అడల్ట్‌ కంటెంట్‌ ఉన్న ఆ వెబ్‌ సిరీస్‌కు ఓకే చెప్పడం గమనార్హం.

ఇలాంటి టైమ్‌లో ఈషాను వెతుక్కుంటూ ఓ తెలుగు సినిమా ఆఫర్ వచ్చింది. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ తర్వాత సుశాంత్ చేసే తర్వాతి మూవీకి ఆమెను ఎంచుకున్నట్టు సమాచారం. ఆ మూవీలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉందట. ఈషా ఒక హీరోయిన్‌గా ఎంపికైనట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే చాన్సుంది. ఈషా మెయిన్ హీరోయినా.. సెకండ్ హీరోయినా అన్నది కూడా అప్పుడే తెలుస్తుంది.