కలవరపెడుతున్న కరోనా థర్డ్ వేవ్..

కరోనా మూడో దశపై ఆందోళన కలుగుతోంది. ఇప్పటికే ఒకటి, రెండు దశల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మాస్కులు ధరించాలని అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని చెబుతున్నారు. వ్యాక్సిన్లు వేసుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య కొన్ని ప్రాంతాల్లో పెరుగుదల కనిపిస్తోంది. కేరళ, మహారాష్ర్ట లాంటి స్టేట్లలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరగుతున్నట్లు తెలుస్తోంది. కరోనా మూడో దశ ఆగస్టు చివరి వారంలో […]

Written By: Srinivas, Updated On : August 3, 2021 5:45 pm
Follow us on

కరోనా మూడో దశపై ఆందోళన కలుగుతోంది. ఇప్పటికే ఒకటి, రెండు దశల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మాస్కులు ధరించాలని అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని చెబుతున్నారు. వ్యాక్సిన్లు వేసుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య కొన్ని ప్రాంతాల్లో పెరుగుదల కనిపిస్తోంది. కేరళ, మహారాష్ర్ట లాంటి స్టేట్లలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరగుతున్నట్లు తెలుస్తోంది.

కరోనా మూడో దశ ఆగస్టు చివరి వారంలో తన ప్రభావం చూపించనుందని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే నవంబర్ నెలలో థర్డ్ వేవ్ ప్రారంభం అవుతుందని మరో అంచనా. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావాలని ఆకాంక్షిస్తున్నారు. సమర్థవంతమైన పునరుత్పత్తి రేటు ఆర్ విలువ ఒకటి కంటే ఎక్కువ నమోదు అవుతున్న సందర్భంలో ప్రజలు అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు.

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఇప్పటికే పలు రకాల హెచ్చరికలు చేస్తున్నారు. మళ్లీ తిరగబడితే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. రెండు దశల్లో చవిచూసిన ఫలితాలతో ఇంకా అలర్ట్ కావాలని చెబుతున్నారు. మూడో దశ పొంచి ఉన్న నేపథ్యంలో అందరు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నవంబర్ చివరి నాటికి మూడో దశ వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు.

దేశంలో సెకండ్ వేవ్ ఫిబ్రవరిలో వస్తుందని ఊహించారు. దానికి అనుగుణంగానే సెకండ్ వేవ్ కల్లోలం సృష్టించింది. ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ పై కూడా అందరిలో భయం పట్టుకుంది. మూడో దశ ముప్పుతో దేశం ఏ సమస్యలు ఎదుర్కొంటుందోనని భావిస్తున్నారు. మహమ్మారి ప్రభావంతో ప్రజలు ఏ ఇబ్బందులు పడతారోనని ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కరోనా మూడో దశ ముప్పును తప్పించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించనున్నారు.