Corona Third Wave: అక్టోబర్ లో భారత్ లో థర్డ్ వేవ్.. పిల్లలకు డేంజర్

Corona Third Wave: దేశంలో కొవిడ్(COVID) మహమ్మారి విజృంభన కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు కేసులు తగ్గినా ప్రస్తుతం కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో కరోనా మహమ్మారిపై హెచ్చరికలు చేస్తోంది. మూడో దశ (Third Wave) ముప్పు రానుందని చెబుతోంది. రెండో దశలో ఎదుర్కొన్న కష్టాలను బేరీజు వేసుకుని అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచిస్తోంది. దీంతో పిల్లలు జాగ్రత్తగా ఉండాలని నివేదిక వెల్లడిస్తోంది. గత మార్చిలో కొవిడ్ ప్రభావంతో […]

Written By: Srinivas, Updated On : August 23, 2021 3:38 pm
Follow us on

Corona Third Wave: దేశంలో కొవిడ్(COVID) మహమ్మారి విజృంభన కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు కేసులు తగ్గినా ప్రస్తుతం కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో కరోనా మహమ్మారిపై హెచ్చరికలు చేస్తోంది. మూడో దశ (Third Wave) ముప్పు రానుందని చెబుతోంది. రెండో దశలో ఎదుర్కొన్న కష్టాలను బేరీజు వేసుకుని అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచిస్తోంది. దీంతో పిల్లలు జాగ్రత్తగా ఉండాలని నివేదిక వెల్లడిస్తోంది.

గత మార్చిలో కొవిడ్ ప్రభావంతో దేశం ఎంత నష్టం పొందిందో తెలుసుకున్నాం. మొదటి దశ కంటే రెండో దశలో కష్టాలు పెరిగాయి. మరణాలు ఎక్కువగానే సంభవించాయి. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. కరోనా(Corona) కేసులు ఏప్రిల్ నుంచి తగ్గుముఖం పట్టినా థర్డ్ వేవ్ పొంచి ఉందని చెబుతున్న నేపథ్యంలో ప్రజల్లో అలజడి పెరుగుతోంది. ఈ దశలో రెండో దశ ముప్పును ఎదుర్కొన్నా మూడో దశ ముప్పు పై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం గుర్తించాల్సిందే.

దేశంలో మూడో దశ ప్రారంభమైందని సూచనలు వెల్లడిస్తున్నాయని చెబుతున్న క్రమంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. రెండో దశ భయానికంటే మూడో దశ ముప్పుపైనే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. పెద్దల కంటే పిల్లలపై ప్రభావం చూపనున్న తరుణంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే పాఠశాలలు మూత పడిన సందర్భంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలని కేంద్రం చెబుతోంది.

తాజాగా కేంద్ర హోం శాఖ నియమించిన నేషనల్ ఇనిస్టి ట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ప్యానెల్ ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించిన నివేదికలో భారత్ ఇప్పటికే థర్డ్ వేవ్ ప్రభావం మొదలైందని సూచిస్తోంది. ఏ స్టేట్లలో దీని ప్రభావం ప్రారంభమైందనేది చెబుతోంది. కొవిడ్ 19 థర్డ్ వేవ్ ప్రభావంపై ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.

ప్రస్తుతం దేశంలో మొదలైన మూడో దశ సెప్టెంబర్ నాటికి క్రమంగా విస్తరిస్తోందని తెలుస్తోంది. అక్టోబర్ నాటికి తీవ్ర స్థాయికి చేరుకునే ప్రమాదం ఉందని వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జాగ్రత్తలు తీసుకుని మహమ్మారిని నిర్మూలించాలని కోరుతోంది. దేశవ్యాప్తంగా దూసుకొస్తున్న మూడో దశ ముప్పు పిల్లలపై ప్రభావం చూపుతుందని హెచ్చరికలు వస్తున్న క్రమంలో అప్రమత్తత పాటించాలని పేర్కొంది.

దేశవ్యాప్తంగా కొవిడ్ ఒకటి, రెండో దశలతో ప్రజలు ఇబ్బందులు పడిన నేపథ్యంలో మూడో దశ ముప్పును కూడా ఎదుర్కోవాలని చెబుతున్నారు. ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. సరైన వైద్య పరికరాలు, వసతులు కల్పించి ప్రజలను భయాందోళనలు దూరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచి అందరికి అందుబాటులో వ్యాక్సిన్లు ఉండేలా చూడాలని చెబుతోంది. కరోనా మహమ్మారి విషయంలో అజాగ్రత్త వద్దని హెచ్చరికలు పంపింది.