సమీపంలో కోవిడ్-19 ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే అప్రమత్తం చేయడం కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన `ఆరోగ్యసేతు’ యాప్ ఒక వంక విశేష ప్రజాదరణ పొందుతూ ఉండగా, మరోవంక అది వ్యక్తుల గోప్యతకు ఆస్కారం లేకుండా చేస్తున్నదనే రాజకీయ దుమారం చిక్కుకొంటున్నది.
మోదీ గుజరాత్ కే ప్రధానా.. నిప్పులు చెరిగిన శరద్ పవర్
ఇప్పటికే ఈ యాప్‌ను వాడుతున్న వారిసంఖ్య దేశంలో ఏడున్నర కోట్లకు చేరిందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న ప్రస్తుత తరుణంలో దేశ ప్రజలందరూ తమ మొబైల్ ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతోపాటు ప్రజలందరికీ ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరని కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
కంటైన్‌మెంట్ జోన్లలో ఉన్నవారికి ఇది చాలా ముఖ్యమని హోంశాఖ పేర్కొన్నది. ఏప్రిల్ మొదటి వారంలో ప్రవేశపెట్టిన ఈ యాప్‌వల్ల కాంటాక్ట్ ట్రేసింగ్ నుంచి రక్షణ ఉంటుందని, దీన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని, అందుకు అధికారులు కూడా సహకరించాలని హోంశాఖ సూచించింది.
అయితే `ఆరోగ్య సేతు’ ఓ అధునాతన నిఘా వ్యవస్థ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. వ్యవస్థీకృత పర్యవేక్షణ లేకుండానే దీని నిర్వహణ బాధ్యతలను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించారని విమర్శించారు.
ముంబై బాంద్రా రైల్వే స్టేషన్ ఘటన పునరావృతం..ఎక్కడంటే?
దీనికి సంస్థాగత పర్యవేక్షణ లేకపోవడం వల్ల డేటా భద్రతకు భంగం కలగడం, వ్యక్తిగత గోప్యత సమస్యలు లాంటివి పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం అనేది మనల్ని సురక్షితంగా ఉంచాలి కానీ, అనుమతి లేకుండా మనపై నిఘా ఉంటుందన్న భయాలను మాత్రం కలిగించకూడని రాహుల్ గాంధీ హెచ్చరించారు.
మరోవంక, ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 45 ప్రజా సంఘాలు, 100 మందికి పైగా ప్రముఖులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకీ వ్రాసిన ఒక లేఖలో ఈ యాప్ ఉపయోగించడాన్ని ప్రభుత్వం నిర్బంధంగా చేసే ప్రయత్నాల పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రజల సమాచార గోప్యతకు ప్రమాదం చేకూరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
యాప్ వాడకానికి వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారని, దీంతో వ్యక్తిగత గోప్యత ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని మజ్లిస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.
అయితే అరోగ్య సేతు యాప్ పూర్తి శాస్త్రీయబద్ధమైన సాధనమని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేవకర్ స్పష్టం చేశారు. సమీపంలో కోవిడ్-19 ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే అది అప్రమత్తం చేస్తోందని, వ్యక్తిగత వివరాలకు గోప్యతపై ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు.
ఇది ఉత్తమమైన శాస్త్రీయ సాధనమని చెబుతూ నిజానికి ఇందుకోసం పెద్దగా సేకరిస్తున్న వివరాలు కూడా ఏమీ లేవని మంత్రితెలిపారు. దగ్గు, జలుబు, లేదా పాజిటివ్‌గా నిర్దారణ అయితేనే ఆ సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ యాప్ లాక్‌డౌన్ తర్వాత కూడా రాబోయే ఒకటి రెండేళ్లు కొనసాగుతుందని చెప్పారు.