కరోనా కల్లోలం: దేశంలో మరణమృదంగం

గత సంవత్సరం ఇదే సమయంలో ఇటలీ దేశంలో కరోనా కల్లోలం సృష్టించింది. ఆ సమయంలో అక్కడి ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. బెడ్లు ఖాళీగా లేక 70 ఏళ్లు దాటిన వృద్ధులను వదిలేశారు. దీంతో పెద్దఎత్తున వృద్ధులు చనిపోయి శశ్మానాల్లో గుట్టలుగా సామూహిక దహనాలు చేసిన వైనం ప్రపంచవ్యాప్తంగా అందరినీ కలిచివేసింది. ఇప్పుడు అలాంటి పరిస్థితియే దేశంలో దాపురించింది. గుజరాత్ , మహారాష్ట్రల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. గుజరాత్ లోని సూరత్ లో అయితే శవాలతో […]

Written By: NARESH, Updated On : April 15, 2021 7:05 pm
Follow us on

గత సంవత్సరం ఇదే సమయంలో ఇటలీ దేశంలో కరోనా కల్లోలం సృష్టించింది. ఆ సమయంలో అక్కడి ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. బెడ్లు ఖాళీగా లేక 70 ఏళ్లు దాటిన వృద్ధులను వదిలేశారు. దీంతో పెద్దఎత్తున వృద్ధులు చనిపోయి శశ్మానాల్లో గుట్టలుగా సామూహిక దహనాలు చేసిన వైనం ప్రపంచవ్యాప్తంగా అందరినీ కలిచివేసింది.

ఇప్పుడు అలాంటి పరిస్థితియే దేశంలో దాపురించింది. గుజరాత్ , మహారాష్ట్రల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. గుజరాత్ లోని సూరత్ లో అయితే శవాలతో అంబులెన్స్ లు దహనసంస్కారాలకు క్యూలో నిలబడ్డ తీరు కలవరపెడుతోంది. మహారాష్ట్రలో ఆస్పత్రులన్నీ నిండిపోయి స్టార్ హోటల్స్ లను ఆస్పత్రులుగా మారుస్తున్నారు. తమకు కరోనా తీవ్రత నుంచి సహాయం చేయాలని మహారాష్ట్ర సర్కార్ తాజాగా కేంద్రాన్ని, సైన్యాన్ని కోరిందంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

* దేశంలో ఒక్కరోజే 2 లక్షల కేసులు
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ దారుణంగా ఉంది. భారీగా ప్రాణాలను తీస్తోంది. బుధవారం ఒక్కరోజే దేశంలో 2 లక్షలకు పైగా కేసులు.. 1000కు పైగా మరణాలు సంభవించాయంటే పరిస్థితులు ఎంతగా దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. గడిచిన 24 గంటల్లో దేశంలో 200739 కొత్త కేసులు., 1038మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రోజువారీ కేసుల సంఖ్య దాదాపు 10రోజుల్లోనే రెట్టింపు కావడం విశేషం.

కొత్త కేసులు ఒక్కరోజే లక్షకు పైన నమోదైన దేశాల్లో అమెరికా, భారత్ మాత్రమే ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దేశవ్యాప్తంగా కరోనా టీకాల కార్యక్రమాన్ని పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

*రాష్ట్రాల్లో మరణ మృదంగం
దేశంలోకెల్లా మహారాష్ట్ర కరోనాకు హబ్ గా మారింది. అక్కడే దేశవ్యాప్తంగా 50వేల కేసులు నమోదవుతుండడం గమనార్హం. తాజాగా మహారాష్ట్రలో ఒక్కరోజులో 58952 కొత్త కేసులు నమోదు కాగా.. 278మంది మరణించారు. ఇక ఆ తర్వాత మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, గుజరాత్, ఢిల్లీలో కరోనా మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. గుట్టలుగా శవాలు పేరుకుపోతున్నాయని.. శశ్మన వాటికల్లో స్థలం లేదనే వార్తలు కలిచివేస్తున్నాయి. యూపీలోనూ కేసుల తీవ్రతగా భారీగా పెరిగింది. అయితే ప్రభుత్వం చెబుతున్న కేసులు, మరణాలకు మించి బయట నమోదవుతున్నాయని చెబుతున్నారు.

*ఏపీలో 5వేలు దాటిన కేసులు
ఏపీలో కరోనా కల్లోలం చోటుచేసుకుంటోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజులో ఏపీ వ్యాప్తంగా 5086 కేసులు నమోదు కావడం ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది. చిత్తూరు జిల్లాలో ఐదుగురు చనిపోయారు. ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 7353కి చేరింది.

*తెలంగాణలో 3307 కొత్త కేసులు
తెలంగాణలోనూ కరోనా కేసులు అనూహ్యంగా పెరిగాయి. 1000 లోపే ఉండే కేసులు గడిచిన 24 గంటల్లో ఏకంగా 3307 కొత్త కేసులు వెలుగుచూశాయి. కరోనాతో నిన్న ఒక్కరోజే 8 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 1788కి చేరింది. కరోనా ధాటికి హైదరాబాద్ లోని ఆస్పత్రుల్లో బెడ్స్ దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటికే ఆస్పత్రుల్లోని బెడ్స్ అన్నీ కూడా పేషెంట్లతో నిండిపోయాయి. హైదరాబాద్ లో ఇప్పుడు రికమండేషన్ లేనిదే ఒక్క బెడ్ కూడా దొరికే పరిస్థితి లేదని వైద్యవర్గాలు చెబుతున్నాయి.