పది, ఇంటర్ పరీక్షలపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

వరుసగా రెండో ఏడాది కూడా చదువులు అటకెక్కాయి. విద్యార్థులు పాఠశాల ముఖం చూడలేకపోయారు. 2020 బ్యాచ్ తోపాటు 2021 బ్యాచ్ పదోతరగతి విద్యార్థులు కూడా లక్కీ ఫెలోస్. పరీక్షలు రాయకుండానే పాస్ అయిపోయారు. కరోనా ఉధృతి కారణంగా పరీక్షలు నిర్వహించే అవకాశాలు లేకపోవడంతో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కల్లోలంలో వరుసగా రెండో ఏడాది కూడా తెలంగాణలో పదోతరగతి పరీక్షలను రద్దు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే కేంద్రంలోని సీబీఎస్ఈ […]

Written By: NARESH, Updated On : April 15, 2021 6:30 pm
Follow us on

వరుసగా రెండో ఏడాది కూడా చదువులు అటకెక్కాయి. విద్యార్థులు పాఠశాల ముఖం చూడలేకపోయారు. 2020 బ్యాచ్ తోపాటు 2021 బ్యాచ్ పదోతరగతి విద్యార్థులు కూడా లక్కీ ఫెలోస్. పరీక్షలు రాయకుండానే పాస్ అయిపోయారు. కరోనా ఉధృతి కారణంగా పరీక్షలు నిర్వహించే అవకాశాలు లేకపోవడంతో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

కరోనా కల్లోలంలో వరుసగా రెండో ఏడాది కూడా తెలంగాణలో పదోతరగతి పరీక్షలను రద్దు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే కేంద్రంలోని సీబీఎస్ఈ పరీక్షలు కూడా రద్దు అయ్యాయి. ఇదే తరుణంలో రాష్ట్రంలో కూడా పరీక్షలను రద్దు చేయడం విశేషం.

ఇక కీలకమైన ఇంటర్మీడియెట్ పరీక్షలను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ విషయంపై సీఎం కేసీఆర్ కు విద్యాశాఖ మంత్రి ఫైల్ పంపించారు. కేసీఆర్ ఆమోదముద్రతో పదోతరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి 5.35 లక్షల మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. వీరిందరినీ పరీక్షలు లేకుండానే ఇంటర్ కు ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. ఇక ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు 4.58 లక్షల మంది ఉన్నారు. వారి భవితవ్యం ఏంటనేది త్వరలోనే తేలనుంది.