కరోనాతో పిల్లలకే కాదు జంతువులకూ ప్రమాదమే!

కరోనా మహమ్మారి భయానికి అందరు జంకుతున్నారు. ప్రపంచమే కుదేలైపోతోంది. అన్ని దేశాలు వైరస్ ధాటికి గజగజవణుకుతున్నాయి. మొదటి దశ కంటే రెండో దశ అత్యంత ప్రమాదకరంగా మారి ప్రజల ప్రాణాలు బలిగొంది. అంతేకాదు ఇప్పుడు మూడోదశ ముప్పు కూడా పొంచి ఉందన్న భయంతో నిత్యం భయాందోళన చెందుతున్నారు. కరోనా మహమ్మారి మనుషులకే కాదు జంతువులకు కూడా ముప్పుగా పరిణమిస్తోంది. ఇప్పటికే అనేక జంతు ప్రదర్శన శాలల్లోని జంతువులు కరోనా బారిన పడ్డాయి. కొన్ని ప్రాణాలు సైతం కోల్పోయాయి. […]

Written By: Srinivas, Updated On : July 20, 2021 5:56 pm
Follow us on

కరోనా మహమ్మారి భయానికి అందరు జంకుతున్నారు. ప్రపంచమే కుదేలైపోతోంది. అన్ని దేశాలు వైరస్ ధాటికి గజగజవణుకుతున్నాయి. మొదటి దశ కంటే రెండో దశ అత్యంత ప్రమాదకరంగా మారి ప్రజల ప్రాణాలు బలిగొంది. అంతేకాదు ఇప్పుడు మూడోదశ ముప్పు కూడా పొంచి ఉందన్న భయంతో నిత్యం భయాందోళన చెందుతున్నారు. కరోనా మహమ్మారి మనుషులకే కాదు జంతువులకు కూడా ముప్పుగా పరిణమిస్తోంది. ఇప్పటికే అనేక జంతు ప్రదర్శన శాలల్లోని జంతువులు కరోనా బారిన పడ్డాయి. కొన్ని ప్రాణాలు సైతం కోల్పోయాయి.

తాజా అధ్యయనాల్లో జంతువులకు కరోనా సోకే ప్రమాదం అధికమే. న్యూయార్క్ కు చెందిన వెటర్నరీ బయోమెడికల్ పరిశోధకుడు డాక్టర్ హెన్హ్ లీ ఆయన సతీమణి యూయింగ్ బియాంగ్ జరిపిన పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. కుక్కలు,పిల్లుల్లో కొవిడ్ ప్రభావంపై వారు పరిశీలన చేశారు. పిల్లుల్లో కంటే కుక్కల్లో కరోనా వైరస్ ఎదుర్కొనే ప్రతి రక్షకాలు అధికంగా ఉన్నట్లు యాంటీ బాడీ పరీక్షలో నిర్ధారించారు. వారి పరిశోధన వివరాలు వైరలెన్స్ జర్నల్ లో ప్రచురితం అయ్యాయి. పిల్లులకు కరోనా వైరస్ సోకినప్పటికి వాటిలో వైరస్ ప్రభావిత లక్షణాలు స్వల్పంగానే ఉన్నట్లు తేల్చారు.

చైనాలోని హార్బిన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వైద్య బృందం అధ్యయనంలో వైరస్ కు గురైన పిల్లులు, ఇతర పిల్లులకు వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. శునకాల్లో మాత్రం ఇలాంటి వ్యాప్తి ఏమి లేదని తేల్చారు. కోళ్లు, పందులు, బాతులు వైరస్ వచ్చే అవకాశం లేదని నిర్ధారణకు వచ్చారు. జంతువుల నుంచి వాటి యజమానులకు కరోనా వైరస్ సంక్రమించే విషయంపై ప్రత్యక్ష ఆధారాలు లేవని పరిశోధకులు చెబుతున్నారు. ఇది కాస్త ఊపిరి పీల్చుకునే అంశం.

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది వేసవిలో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్ వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. మరోవైపు వచ్చే ఏడాది వేసవిలో నాలుగో దశ ఉంటుందని చెబుతున్నారు. దీంతో కరోనా ఐదు ఆరు ఏళ్లు ఉంటుందని తెలుస్తోంది. వర్షాకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు.