నందమూరి బాలకృష్ణ వ్యక్తిత్వం విభిన్నమైనది, అలాగే ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం, ఎవరైనా తనకు నచ్చకపోతే ఇక వాళ్లెవరో తనకు తెలియదు అంటాడు. తాజాగా ఆస్కార్ అవార్డు విన్నర్ రెహమాన్ ఎవరో నాకు తెలియదు అంటూ మొత్తానికి సోషల్ మీడియా బ్యాచ్ కి మంచి పని కల్పించారు. ఏది ఏమైనా బాలయ్యకు త్వరగా మనుషులు నచ్చరు అనేది మాత్రం క్లారిటీ వచ్చేసింది.
అయితే, ఒక్కసారి బాలయ్యకి కనెక్ట్ అయితే ఇక వారిని సొంత మనుషుల్లా చూసుకుంటారని కూడా ఇండస్ట్రీలో టాక్ ఉంది. పైగా బాలయ్య ఒకసారి కలిస్తే.. ఇక వారితో మళ్ళీ విడిపోవడం దాదాపు అసాధ్యమట. ఈ సంగతి బాలయ్య గురించి బాగా తెలిసిన వాళ్ళే గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మొత్తమ్మీద బాలయ్య వ్యక్తిత్వం ఇంత వైవిధ్యం కాబట్టే..
తెలుగులో చాలామంది దర్శకులు ఉన్నా, బాలయ్యకు మాత్రం కొంతమంది దర్శకులే కనెక్ట్ అవుతారు. ఆ దర్శకులు తనకు హిట్ ఇచ్చినా
ఇవ్వకపోయినా, బాలయ్య మాత్రం వారితో సినిమాలు చేయడానికి ఎల్లప్పుడు ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. వారిలో డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఒకరు.
బాలయ్య తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పూరితో చేయబోయే సినిమా గురించి కూడా ఒక ముచ్చట చెప్పారు. పూరితో సినిమా ఉంటుంది అని, ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని, కాకపోతే సినిమా ఎప్పుడు ఉంటుంది ? ఎలాంటి కథతో సినిమా చేయబోతున్నామో లాంటి వాటి పై ఇంకా క్లారిటీ లేదని, కానీ కచ్చితంగా సినిమా చేస్తామని చెప్పుకొచ్చాడు.
కాగా పూరి, బాలయ్య కోసం ఓ చరిత్ర కారుడి ఆధారంగా కథ రాసినట్టు తెలుస్తోంది. పల్నాటి ప్రాంతానికి చెందిన బ్రహ్మనాయుడు కాలం నాటి కథ అట ఇది. అయితే, వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘పైసా వసూల్’ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా.. బాలయ్య మాత్రం పూరిని ఇంకా నమ్మడం విశేషం.