https://oktelugu.com/

తెలంగాణలో కరోనా రికవరీ రికార్డ్

ఎప్పుడో మార్చి నెలలో తెలంగాణ రాష్ట్రంలోకి చొచ్చుకొచ్చిన కరోనా వైరస్‌.. నెమ్మనెమ్మదిగా రాష్ట్రమంతటికి వ్యాపించింది. ఒకప్పుడు నగరాలు, పట్టణాలకే పరిమితమైన వైరస్‌.. ఇప్పుడు గ్రామాల్లోనూ విజృంభిస్తోంది. రోజూ వస్తున్న కేసులను చూస్తూనే అర్థమవుతోంది. అయితే.. సంతోషపడాల్సిన విషయం ఏంటంటే కరోనా కేసులు ఎన్ని పెరుగుతున్నా అదే స్థాయిలో రికవరీ రేటు ఉంది. డిశ్చార్జీల సంఖ్య లక్షకు మార్క్‌ ను చేరుకుంది. కరోనా వల్ల చనిపోతున్న వారి సంఖ్య కూడా అదుపులోకి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. రోజూ 10కి […]

Written By:
  • NARESH
  • , Updated On : September 3, 2020 / 12:08 PM IST
    Follow us on

    ఎప్పుడో మార్చి నెలలో తెలంగాణ రాష్ట్రంలోకి చొచ్చుకొచ్చిన కరోనా వైరస్‌.. నెమ్మనెమ్మదిగా రాష్ట్రమంతటికి వ్యాపించింది. ఒకప్పుడు నగరాలు, పట్టణాలకే పరిమితమైన వైరస్‌.. ఇప్పుడు గ్రామాల్లోనూ విజృంభిస్తోంది. రోజూ వస్తున్న కేసులను చూస్తూనే అర్థమవుతోంది. అయితే.. సంతోషపడాల్సిన విషయం ఏంటంటే కరోనా కేసులు ఎన్ని పెరుగుతున్నా అదే స్థాయిలో రికవరీ రేటు ఉంది. డిశ్చార్జీల సంఖ్య లక్షకు మార్క్‌ ను చేరుకుంది.

    కరోనా వల్ల చనిపోతున్న వారి సంఖ్య కూడా అదుపులోకి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. రోజూ 10కి పైనే మృతుల సంఖ్య నమోదవుతుండేది. కోలుకుంటున్న వారితోపాటు మృతుల సంఖ్య కూడా తగ్గుతోంది. గురువారం విడుదల చేసిన బులెటిన్‌లో 2817 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. పది మంది చనిపోయారు. ఇప్పటివరకు 856 మంది చనిపోగా.. 1,00,013 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 1,33,406 కరోనా కేసులు నమోదు కాగా.. 32,537 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 25,293 మంది హోం ఐసోలేషన్‌లలో ట్రీట్‌మెంట్‌ పొందుతున్నారు.

    గ్రేటర్ హైదరాబాద్‌లో 24 గంటల్లో కొత్తగా 452 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరీంనగర్, ఖమ్మం, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నల్లగొండ, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్ అర్బన్ జిల్లాల్లో వందకు పైగా కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో కరోనా తీవ్రత రోజురోజుకూ తీవ్రమవుతోంది. 24 గంటల్లోనే కొత్త కేసులు 200లకు పైగా నమోదయ్యాయి. కరీంనగర్-164, ఖమ్మం-157, కొమరంభీమ్ ఆసిఫాబాద్-19, మహబూబ్ నగర్-42, మహబూబాబాద్-62, మంచిర్యాల-71, మెదక్-35, మేడ్చల్ మల్కాజ్‌గిరి-129, ములుగు-18, నాగర్ కర్నూలు-41, నల్లగొండ-157, నారాయణపేట్-21, నిర్మల్-16, నిజామాబాద్-97, పెద్దపల్లి-75, రాజన్న సిరిసిల్ల-53, ఆదిలాబాద్-36, భద్రాద్రి కొత్తగూడెం-89, జగిత్యాల-88, జనగామ-41, జయశంకర్ భూపాలపల్లి-26, జోగుళాంబ గద్వాల-33, కామారెడ్డి-62, రంగారెడ్డి-216, సంగారెడ్డి-76, సిద్ధిపేట్-120, సూర్యాపేట్-116, వికారాబాద్-27, వనపర్తి-45, వరంగల్ రూరల్-46, వరంగల్ అర్బన్-114, యాదాద్రి భువనగిరి-73 కేసులు వచ్చాయి.

    రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య కూడా పెంచినట్లుగా తెలుస్తోంది. కొత్తగా రాష్ట్రవ్యాప్తంగా 59,711 శాంపిళ్లను పరీక్షించినట్లు తాజా బులెటిన్‌లో రిలీజ్‌ చేశారు. ఇప్పటిదాకా టెస్టులు చేసిన శాంపిళ్ల సంఖ్య 15,42,978కి చేరింది. ప్రతి 10 లక్షల జనాభాకు సగటును 41,560 మందికి టెస్టులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్టీపీసీఆర్‌‌, సీబీనాట్‌, ట్రూనాట్‌, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పద్ధతిలో టెస్టులు చేస్తున్నట్లు చెప్పారు.