హాట్ టాపిక్.. వలస కూలీలకు కరోనా పాజిటివ్

మహారాష్ట్రలోని థానే నుండి 930 మంది వలస కూలీలతో ఒక శ్రామిక్ రైలు కర్నూల్ సిటీకి చేరుకుంది. అలా వచ్చిన వారిలో 38 మందికి కరోనా పాజిటివ్ తెలడం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన వీరందరు గుంతకల్లు రైల్వేస్టేషన్‌ లో దిగారు. కర్నూలు జిల్లా కార్మికులు అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆదోనిలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు. ఇప్పటి వరకూ 254 మంది వలస […]

Written By: Neelambaram, Updated On : May 13, 2020 11:25 am
Follow us on

మహారాష్ట్రలోని థానే నుండి 930 మంది వలస కూలీలతో ఒక శ్రామిక్ రైలు కర్నూల్ సిటీకి చేరుకుంది. అలా వచ్చిన వారిలో 38 మందికి కరోనా పాజిటివ్ తెలడం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన వీరందరు గుంతకల్లు రైల్వేస్టేషన్‌ లో దిగారు. కర్నూలు జిల్లా కార్మికులు అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆదోనిలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు.

ఇప్పటి వరకూ 254 మంది వలస కార్మికులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 38 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. ఇందులో కర్నూలు జిల్లావాసులు 27 మంది, కడప జిల్లాకు చెందిన ఒకరు, అనంతపురం జిల్లాకు చెందిన 10 మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. పాజిటివ్‌ వచ్చిన వారిని కొవిడ్‌ ఆసుపత్రులకు తరలించారు.

గతంలో  ఎమ్యెల్యే  హఫీజ్ ఖాన్ మద్దతు గల ఒక ప్రైవేట్ ఆసుపత్రి లాక్ డౌన్ సమయంలో కూడా యద్దేచ్ఛగా పనిచేయడంతో అది వైరస్ వ్యాప్తి కేంద్రంగా మారినట్లువార్తలు వచ్చాయి. దీంతో కర్నూల్ జిల్లాను రెడ్ జోన్ గా ప్రకటించారు. ఇప్పుడు థానే నుండి వచ్చిన వలస కూలీలకు కరోనా పాజిటివ్ రావడం కర్నూల్ ని నిద్రపట్టకుండా చేస్తుంది.