203 జీవోపై కృష్ణా రివర్ బోర్డుకు తెలంగాణ పిర్యాదు!

ఏపీ ప్రభుత్వం పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి, శ్రీశైలం నుంచి కొత్త ఎత్తిపోతల పథకంను ఏర్పాటు చేయాలని చూస్తుంది. ఈ మేరకు ఏపీ 203 జీవో ను కూడా చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఏపీ సర్కార్ శ్రీశైలం నుంచి 3 టీఎంసీ నీటిని తరలించే ప్రయత్నం చేస్తోందని ఈ కొత్త ఎత్తిపోతల పథకంను ఏర్పాటు చేయడం అన్యాయమని లేఖలో ఫిర్యాదు చేసింది. ఏపీ ప్రభుత్వం […]

Written By: Neelambaram, Updated On : May 13, 2020 12:07 pm
Follow us on

ఏపీ ప్రభుత్వం పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి, శ్రీశైలం నుంచి కొత్త ఎత్తిపోతల పథకంను ఏర్పాటు చేయాలని చూస్తుంది. ఈ మేరకు ఏపీ 203 జీవో ను కూడా చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఏపీ సర్కార్ శ్రీశైలం నుంచి 3 టీఎంసీ నీటిని తరలించే ప్రయత్నం చేస్తోందని ఈ కొత్త ఎత్తిపోతల పథకంను ఏర్పాటు చేయడం అన్యాయమని లేఖలో ఫిర్యాదు చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన 203 జీవోను వెంటనే నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది. కృష్ణా రివర్ మేనేజ్‌ మెంట్ బోర్డు అపెక్స్ కౌన్సిల్ అనుమతితోనే కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టాలని, పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించిందని తెలంగాణ స్పష్టం చేసింది. టెండర్ల ప్రక్రియ నిలిపివేసేలా కృష్ణా బోర్డు చర్యలు చేపట్టాలని కోరింది.

ఇదే విషయంపై ఏపీ సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణకి అన్యాయం చేయకుండా వరదల ద్వారా వచ్చి, సముద్రంలో కలిసిపోయె నీటిని మాత్రమే మా ప్రభుత్వం వాడుకోవలనుకుంటుదని ఆయన తెలిపారు. అందుకే 203 జీవో ను జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.