Corona : కరోనా వల్ల దాదాపు మూడు సంవత్సరాల పాటు మన దేశం తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంది. ఎక్కడికి అక్కడ లాక్ డౌన్ విధించడంతో చాలా వరకు వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఉపాధి కోల్పోయి చాలామంది రోడ్డున పడ్డారు. పత్రికా సంస్థలైతే ఉద్యోగులను అడ్డగోలుగా తొలగించాయి. కష్టకాలంలో వారిని రోడ్డు మీద పడేశాయి. ఇలా చెప్పుకుంటూ పోవాలి గాని కరోనా వల్ల మనదేశంలో ఇబ్బందులు పడ్డవారి బాధలు ఒక పట్టాన పూర్తికావు. లక్ష లక్షలు ఆస్పత్రుల బిల్లులు కట్టినప్పటికీ.. ప్రాణాల దక్కని వారు చాలామంది. అటు అయిన వాళ్ళని కోల్పోయి.. ఆస్తులను కోల్పోయి నరకం చూసినవారు కూడా చాలామంది.. అందుకే కరోనాటి పరిస్థితులు కళ్ళ ముందు కనిపిస్తే చాలామంది కన్నీటి పర్యంతమవుతారు. ఆనాటి రోజులను గుర్తు చేసుకొని గుండెలు అవిసేలాగా రోదిస్తారు.
దాదాపు మూడు సంవత్సరాల పాటు కరోనా మన దేశ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అయితే ఆ తర్వాత మెల్లిమెల్లిగా ప్రపంచం కోలుకోవడం మొదలుపెట్టింది. మన దేశం కూడా అన్ని రంగాలలో మునుపటి పరిస్థితిని నమోదు చేయడం ప్రారంభించింది. అయితే ఇప్పుడు మళ్లీ కరోనా హెచ్చరికలు మొదలయ్యాయి. ప్రస్తుతం కరోనా కేసుల పెరుగుదల ఆందోళనకు కారణమవుతోంది. ముంబైలో కరోనా సోకిన ఇద్దరు మృతి చెందడంతో తాజాగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముంబై మహానగరంలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆసుపత్రిలో 14 సంవత్సరాల బాలుడు.. 54 సంవత్సరాల వ్యక్తి చనిపోయారని తెలుస్తోంది. అయితే వారికి ఇక్కడ అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని ఆసుపత్రి వైద్యులు అంటున్నారు. ఇక ఈనెల 19 నాటికి మనదేశంలో 257 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు..” ఇటీవల కాలంలో ఆసియా ఖండంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మనదేశంలో యాక్టివ్ కేసులు 257 వరకు ఉన్నాయి. ముంబైలో ఇద్దరు చనిపోవడంతో తాజాగా ఆందోళన నెలకొంది. అయితే భయపడాల్సిన పనిలేదని.. కొత్త వేరియంట్ ఏమిటో కనుక్కోవడానికి పరిశోధనలు జరుగుతున్నాయి.. అయితే ఈ వేరియంట్ మనుషుల ప్రాణాలకు అంతగా ముప్పు కలిగించదని” వైద్యులు చెబుతున్నారు.
Also Read : కరోనా మళ్లీ వస్తోంది.. వారంలో 25,900 కేసులు.. హైఅలెర్ట్!
అయితే ఈ కాలంలో కరోనా వైరస్ మళ్ళీ వ్యాపిలోకి రావడానికి కారణాలు ఏమై ఉంటాయోనని పరిశోధకులు ఆరా తీస్తున్నారు. అయితే డ్రాగన్ దేశంలో కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన నెలకొంది. అయితే ప్రస్తుతం భయపడాల్సిన పరిస్థితి లేదని.. కాకపోతే వాతావరణంలో మార్పుల వల్ల కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని.. వైద్యుల సూచన మేరకు మందులు వాడితే పెద్దగా ఇబ్బంది ఉండదని తెలుస్తోంది. ముంబైలో చోటు చేసుకున్న రెండు మరణాలు కేవలం కరోనా వల్ల మాత్రమే కాదని.. వారికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని. అందువల్లే చనిపోయారని వైద్యులు అంటున్నారు.