https://oktelugu.com/

కొత్త పనిష్మెంట్ ఇస్తున్న బెజవాడ పోలీసులు!

విజయవాడ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో లాక్ డౌన్ ఆంక్షలను పోలీసులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. 9 గంటల తరువాత సరైన కారణం లేకుండా రోడ్లపైకి వస్తున్న వారిని గుర్తించి వినూత్న రీతిలో శిక్షిస్తున్నారు. ‘మరో మారు తప్పు చేయను. ఇంకెప్పుడు అవసరం లేకుండా బయటకు రాను’ అని 500 సార్లు రాయించుతున్నారు. ఇందుకు అవసరమైన పేపర్లు, పెన్నులు పోలీసులే అందిస్తున్నారు. నిన్న సత్తెనపల్లిలో జరిగిన ఘటనతో పోలీసులు కాస్త కఠిన్యాన్ని తాగించారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 21, 2020 / 02:48 PM IST
    Follow us on

    విజయవాడ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో లాక్ డౌన్ ఆంక్షలను పోలీసులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. 9 గంటల తరువాత సరైన కారణం లేకుండా రోడ్లపైకి వస్తున్న వారిని గుర్తించి వినూత్న రీతిలో శిక్షిస్తున్నారు. ‘మరో మారు తప్పు చేయను. ఇంకెప్పుడు అవసరం లేకుండా బయటకు రాను’ అని 500 సార్లు రాయించుతున్నారు. ఇందుకు అవసరమైన పేపర్లు, పెన్నులు పోలీసులే అందిస్తున్నారు.

    నిన్న సత్తెనపల్లిలో జరిగిన ఘటనతో పోలీసులు కాస్త కఠిన్యాన్ని తాగించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండానే వారిలో అవగాహన కలిగించేందుకు ఎటువంటి శిక్షలు వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

    కృష్ణ జిల్లాలో 83 మంది వైరస్ బారిన పడగా అందులో మెజారిటీ కేసుల వరకు విజయవాడ నగరంలో ఉన్నాయి. పాయకపురం, రాణిగారితోట, మాచవరం, సీతారమపురం, విద్యాధరపురం, కుద్దుస్ నగర్, బందరు రోడ్డు తదితర ప్రాంతాలను రెడ్ జోన్ లుగా అధికారులు ప్రకటించారు. కాలనీల్లో స్థానికులు అంతర్గతంగా తిరగటంతో వైరస్ వ్యాప్తి చెందుతుందని సిపి ద్వారాక తిరుమల రావు తెలిపారు.