https://oktelugu.com/

ఏపీలో వారికి రూ. 5 వేలు సాయం!

దేవాలయాలు, మసీదులు, చర్చిలో మత పరమైన కార్యక్రమాలు చేస్తున్నవారికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీఓను మంగళవారం ప్రభుత్వం విడుదల చేసింది. అర్చకులు, ఇమామ్, మౌజమ్స్, పాస్టర్ లకు ఈ సాయం అందజేయనున్నారు. గుర్తింపు పొందిన మసీదులకే కాకుండా… గుర్తింపు పొందని మసీదులో ఇమామ్, మౌజమ్ లకు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే అర్చకులకు రూ. 5 వేలు అందజేస్తున్నారు. ఇందుకు సంబంధించి గతం లో నే ఉత్తర్వులు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 21, 2020 2:58 pm
    Follow us on

    దేవాలయాలు, మసీదులు, చర్చిలో మత పరమైన కార్యక్రమాలు చేస్తున్నవారికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీఓను మంగళవారం ప్రభుత్వం విడుదల చేసింది. అర్చకులు, ఇమామ్, మౌజమ్స్, పాస్టర్ లకు ఈ సాయం అందజేయనున్నారు. గుర్తింపు పొందిన మసీదులకే కాకుండా… గుర్తింపు పొందని మసీదులో ఇమామ్, మౌజమ్ లకు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే అర్చకులకు రూ. 5 వేలు అందజేస్తున్నారు. ఇందుకు సంబంధించి గతం లో నే ఉత్తర్వులు ఇచ్చారు. అర్హులను గుర్తించాలని దేవాదాయశాఖ, వక్ఫ్ బోర్డు, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కి ఉన్నతాధికారులు సూచించారు. ప్రభుత్వ వేతనం పొందుతున్న వారికి ఈ పథకం వర్తించదు అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

    కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా నెల రోజుల నుంచి లాక్ డౌన్ కొనసాగుతూ ఉండటంతో రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, చర్చిలు, మసీదులు మూతబడ్డాయి. దీంతో వీటిపై ఆధారపడి జీవిస్తున్న అర్చకులు, ఇమామ్, మౌజమ్స్, పాస్టర్ ల కుటుంబాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.