https://oktelugu.com/

కరోనా సోకింది.. ఏపీ జనాల ‘బతుకు’ చితికింది

  చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ముందుగా ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించింది. భారత్‌కు చివరగా వచ్చినా దాదాపు దేశంలోని 10 శాతం మందికి విస్తరించినట్లు అధికారికంగానే వెల్లడైంది. మొదట పట్టణాల్లోనే విజృంభించిన కరోనా ఆ తరువాత పల్లెలకు పాకి ప్రజల జీవనవ్యవస్థను అస్తవ్యస్థం చేసింది. కరోనా రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో రకంగా వైరస్‌ బారినపడడం ఇప్పుడు కామన్‌ అయిపోయింది. మన ఊర్లోనే కాదు.. మన పక్కనే కరోనా ఉందనే విషయం ఇప్పుడు తప్పకుండా […]

Written By:
  • NARESH
  • , Updated On : October 8, 2020 / 12:42 PM IST
    Follow us on

     

    చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ముందుగా ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించింది. భారత్‌కు చివరగా వచ్చినా దాదాపు దేశంలోని 10 శాతం మందికి విస్తరించినట్లు అధికారికంగానే వెల్లడైంది. మొదట పట్టణాల్లోనే విజృంభించిన కరోనా ఆ తరువాత పల్లెలకు పాకి ప్రజల జీవనవ్యవస్థను అస్తవ్యస్థం చేసింది. కరోనా రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో రకంగా వైరస్‌ బారినపడడం ఇప్పుడు కామన్‌ అయిపోయింది. మన ఊర్లోనే కాదు.. మన పక్కనే కరోనా ఉందనే విషయం ఇప్పుడు తప్పకుండా గ్రహించాలి.

    Also Read: లాయర్లను బెదిరిస్తారా? ఏపీ పోలీసులపై హైకోర్టు ఫైర్‌‌

    కరోనా వైరస్‌ ప్రజల ఆరోగ్యాన్నే కాకుండా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందనే విషయం అందరికీ తెలుసు. ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి తగ్గి ఆర్థికంగా పుంజుకుంటుందని వస్తున్న వార్తలను చూస్తున్నాం. కరోనా వైరస్‌ ప్రభావం తగ్గినా కానీ కొన్ని గ్రామాలు, పట్టణాలు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇందుకు ఉదాహరణంగా ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ఉదాహరణగా తీసుకోవచ్చు.

    కరోనా తీవ్రత దేశంలో రెండోస్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే తూర్పుగోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉంది. కరోనా ప్రారంభ సమయంలో ఈ జిల్లాలో పెద్దగా ప్రభావం లేకున్నా ఆ తరువాత కేసులు విజృంభించాయి. రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఉన్నా కొందరికి లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిల్లో జాయిన్‌ అయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం లేని కొందరు ప్రైవేట్‌లో చికిత్స చేయించుకున్నారు. వైరస్‌ నుంచి కోలుకున్నా ఫైనాన్షియల్‌గా మాత్రం కూరుకుపోయారు. ఈ పరిస్థితి ఎక్కువగా ఎగువ, మధ్యతరగతి వారికే ఉందని తెలుస్తోంది. సామాన్యులు, కూలీలు వారి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. మధ్యతరగతి వారి పరిస్థితి మాత్రం చెప్పలేని పరిస్థితి దాపురించింది.

    Also Read: విద్యార్థులకు జగనన్న కానుక ఇదీ..

    కరోనా వైరస్‌ సోకి ఆసుపత్రిలో చికిత్స చేసుకున్నవారికి ఏపీ ప్రభుత్వం రూ. 2వేలు ఇస్తానని తెలిపింది. అలాగే మృతి చెందిన వారికి రూ.15 వేలు అందిస్తామన్న హామీ మరిచింది. తొలుత కరోనా సోకి ఇంట్లో చికిత్స తీసుకుంటున్న వారికి ప్రభుత్వం కిట్లు అందజేసింది. ఆ తరువాత దానిపై శ్రద్ద ఉంచకపోవడంతో బాధితులు ప్రైవట్‌లో కొనుగోలు చేసుకున్నారు. దీంతో ఉన్న ఆదాయమంతా మందుల ఖర్చులకే పోయిందంటున్నారు.అటు ప్రోత్సాహం లేక.. ఇటు ఆదాయం లేక మధ్యతరగతి జీవుడు ఇప్పటికీ కుమిలిపోతున్నాడు. కరోనా ప్రభావం కొంతకాలమే అనుకున్నా.. ఆర్థికంగా మాత్రం శాశ్వతంగా నష్టపోయే అవకాశముందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.