https://oktelugu.com/

జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా భయం?

కరోనా ఎంత పనిచేశావే అంటూ ఇప్పుడు ఏపీలోని అధికార వైసీపీ ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట.. కరోనా భయంతో ఆందోళనగా ఉన్నారట.. అందరూ క్వారంటైన్లు, టెస్టులు చేయించుకునేందుకు ఇప్పుడు క్యూ కడుతున్నారట.. సీఎం జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలందరికీ ఇప్పుడు కరోనా భయం పట్టుకుంది. అవును ఆ ఒక్క ఎమ్మెల్యే ఇప్పుడు అందరినీ భయపెడుతున్నాడట.. ఎవ్వరినీ స్థిమితంగా ఉండకుండా చేశాట.. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే ఎందుకిలా జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారో తెలుసా? మండలిపై టీడీపీ ప్రయత్నాలు […]

Written By:
  • NARESH
  • , Updated On : June 23, 2020 / 02:46 PM IST
    Follow us on


    కరోనా ఎంత పనిచేశావే అంటూ ఇప్పుడు ఏపీలోని అధికార వైసీపీ ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట.. కరోనా భయంతో ఆందోళనగా ఉన్నారట.. అందరూ క్వారంటైన్లు, టెస్టులు చేయించుకునేందుకు ఇప్పుడు క్యూ కడుతున్నారట..

    సీఎం జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలందరికీ ఇప్పుడు కరోనా భయం పట్టుకుంది. అవును ఆ ఒక్క ఎమ్మెల్యే ఇప్పుడు అందరినీ భయపెడుతున్నాడట.. ఎవ్వరినీ స్థిమితంగా ఉండకుండా చేశాట.. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే ఎందుకిలా జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారో తెలుసా?

    మండలిపై టీడీపీ ప్రయత్నాలు ఫలిస్తాయా?

    విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబొండ శ్రీనివాసరావుకు కరోనా సోకింది. ఏపీలో ఒక ఎమ్మెల్యేకు కరోనా సోకడం ఇదే ప్రథమం. ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఇటీవలే తన వ్యక్తిగత పని నిమిత్తం అమెరికా వెళ్లి కొన్నాళ్లు అక్కడే ఉండి ఇటీవలే వచ్చారు. అనంతరం కొన్నాళ్లు ఐసోలేషన్ లో ఉన్నారు. ఆ తర్వాత పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఆయన విశాఖ శివారుల్లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఉంటున్నాడట..

    ఎస్.కోట ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ గా తేలడానికి ముందుగా తాజాగా మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో అసెంబ్లీకి వచ్చి మరీ ఓటేశాడు. ఓటు వేసేటప్పుడు ఆ పోలింగ్ బాక్సును తాకాడు. సంతకం చేశాడు. ఆ తరువాత చాలా మంది ఎమ్మెల్యేలు ఇవే చేశారు. ఇక అంతుకుమందు అసెంబ్లీలో జరిగిన రెండు రోజుల మాక్ పోలింగ్ లో పాల్గొన్నాడు. చాలామందిని కలిశాడు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు ఈయనతో చేతులు కూడా కలుపుకున్నారు అని వినికిడి. వీరంతా సీఎం జగన్ ను కలిసి గెలుపోటములపై చర్చించారు.

    108 స్కామ్ విజయ సాయిరెడ్డి మెడకు చుట్టుకుంటుందా?

    అసెంబ్లీ ఆవరణలో సోషల్ డిస్టేన్స్ లేకుండా కలుపుగోలుగా ఎమ్మెల్యేలంతా తిరిగారు. మరి ఎస్.కోట ఎమ్మెల్యే వల్ల వైసీపీకి చెందిన ఎంతమందికి కరోనా సోకి ఉంటుందనే భయం ఇప్పుడు ఆయనను కలిసిన వైసీపీ ఎమ్మెల్యేలను పట్టిపీడిస్తోంది. వారు సీఎం జగన్ ను కలవడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి వరకూ ఆ కరోనా భయం వెంటాడుతోందట..

    ఎస్.కోట ఎమ్మెల్యేకు కరోనా అని తెలియగానే ఆయనను కలిసిన వారంతా క్వారంటైన్ వెళ్లారని తెలిసింది. ఇప్పుడు సదురు ఎమ్మెల్యేలను కలిసిన వారు కూడా ఆందోళన చెందుతున్నారట.. ఇలా ఒక్క ఎమ్మెల్యేతో సీఎం జగన్ తోపాటు వైసీపీ ఎమ్మెల్యేలకు వారి అనుచరులకు కరోనా భయం పట్టుకుంది. మొత్తంగా వైసీపీ శిబిరం అంతా ఆందోళనగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.