
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి హరీష్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. జూన్ నెల వేతనంపై గత కొద్ది రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈనెల కూడా సగం జీతమే వస్తుందా? లేక పూర్తి వేతనం వస్తుందా? అనే ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి హరీష్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈమేరకు జూన్ నెల వేతనం ఉద్యోగులకు కోతల్లేకుండా మంజూరు చేయనున్నట్లు ప్రకటించినట్లు తెలుస్తోంది.
గవర్నర్ ను కలిసిన జగన్ ఏమి చర్చించారంటే..!
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ అన్నిరాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లిస్తున్నాయి. అయితే తెలంగాణలో మాత్రం ఉద్యోగుల స్థాయిని బట్టి 10నుంచి 75శాతం వరకు కోతలను విధిస్తోంది. వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, విద్యుత్ సిబ్బంది మినహా రాష్ట్రంలోని అన్ని శాఖల ఉద్యోగులకు ప్రభుత్వం జీతాల్లో కోతలను విధిస్తుంది. దీంతో గడిచిన రెండు నెలలుగా ఉద్యోగులకు సగం జీతమే అందుతుండటంతో వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో జూన్ నుంచైనా తమకు పూర్తి వేతం చెల్లించాలని ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్ అండ్ కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక సభ్యులు మంగళవారం ఆర్థిక మంత్రి హరీష్ రావును కలిశారు.
అరెస్టులతో జగన్.. కోర్టులతో టీడీపీ నేతలు
జీతాల్లో కోతలు విధించడంతో ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జూన్ నుంచి తమకు ఎలాంటి కోతల్లేకుండా వేతనం చెల్లించాలని కోరారు. దీనిపై మంత్రి హరీష్ స్పందిస్తూ ఉద్యోగులందరికీ జూన్ నుంచి పూర్తి వేతనాలు, విశ్రాంత ఉద్యోగులకు కూడా పూర్తి పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారట. బకాయిలకు సంబంధించి జీపీఎఫ్‌లో జమ చేయాలనుకుంటున్నామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే సీపీఎస్, పెన్షనర్లకు బకాయిలను వాయిదాల్లో చెల్లించాలని ఆలోచిస్తున్నట్లు వారికి చెప్పినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతన బకాయిలను కూడా జీపీఎఫ్‌లో కాకుండా నగదు రూపంలోనే ఇవ్వాలని మంత్రిని ఐక్యవేదిక కోరగా సానుకూలంగా స్పందిచినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా లాక్‌డౌన్లో ఉద్యోగుల జీతాలను కోత విధించడాన్ని సవాల్ చేస్తూ ఉద్యోగులు, పెన్షనర్లు కోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుతవ్ం ఏ నిబంధనల ప్రకారం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లో కోత విధించాలో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వం ఉద్యోగుల జీతాల్లో పాక్షికంగా, పూర్తిగా కోత విధించేలా తెలంగాణ డిజాస్టర్ అండ్ హెల్త్ ఎమర్జెన్సీకి అధికారం కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ పెన్షన్‌దారులకు కూడా వర్తిస్తుంది. దీనిపై మరోసారి ఉద్యోగ సంఘాల నాయకులు హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై హైకోర్టు విచారించి ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించింది. పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు ఆర్డినెన్స్‌పై మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగులను ఆదుకోవాల్సింది పోయి కోతలు విధించడం ఏంటని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. తాజాగా లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని తమకు జూన్ నుంచి పూర్తిస్థాయి జీతాలు చెల్లించాలని కోరుతున్నారు.
మండలిపై టీడీపీ ప్రయత్నాలు ఫలిస్తాయా?
ఈనేపథ్యంలో మంత్రి హరీష్ రావును ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి తమ సమస్యలను విన్నవించగా సానుకూలంగా స్పందించారు. జూన్ నుంచి ఉద్యోగులకు పూర్తి చెల్లించేందుకు సానుకూలంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు. అయితే హరీష్ రావు ఈ నిర్ణయం సీఎం కేసీఆర్ ను అడిగి తెలుసుకున్నారా లేక స్వంతంగా నిర్ణయం ప్రకటించారా అనేది తేలాల్సి ఉంది. తెలంగాణలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. ప్రకటించాలన్నా సీఎం కేసీఆర్ అడిగి చేయాల్సిందేనని అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఈనేపథ్యంలో మంత్రి హరీష్ రావు ఉద్యోగుల జీతాలపై ఇచ్చిన హామీ ఏమేరకు నిలబెట్టుకుంటారనేది వేచి చూడాల్సిందే..!
ఏదిఏమైనా లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుండటంతో జూన్ నెల నుంచి పూర్తిస్థాయి వేతనాలు అందుతాయనే ఆశాభావాన్ని ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..!