https://oktelugu.com/

మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న సాయి పల్లవి

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో హీరోయిన్ రష్మిక మందన్నకి స్టార్ స్టేటస్ వచ్చింది. ‘అల వైకుంఠపురములో’ వంటి సంక్రాంతి బ్లాక్ బస్టర్ చిత్రం ఉన్నప్పటికీ… ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ప్రజాదరణ లో వెనక్కి తగ్గలేదు. ఆ క్రమంలో ఈ చిత్రం హిట్ రష్మిక కెరీర్ కు మరింత ప్లస్ అయ్యిందనే చెప్పాలి. కాగా ఈ చిత్రంలో ముందు హీరోయిన్ గా వేరే హీరోయిన్ ని అనుకొన్నారు . కానీ అదృష్టం రష్మిక నే […]

Written By: , Updated On : April 23, 2020 / 07:40 PM IST
Follow us on


ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో హీరోయిన్ రష్మిక మందన్నకి స్టార్ స్టేటస్ వచ్చింది. ‘అల వైకుంఠపురములో’ వంటి సంక్రాంతి బ్లాక్ బస్టర్ చిత్రం ఉన్నప్పటికీ… ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ప్రజాదరణ లో వెనక్కి తగ్గలేదు. ఆ క్రమంలో ఈ చిత్రం హిట్ రష్మిక కెరీర్ కు మరింత ప్లస్ అయ్యిందనే చెప్పాలి. కాగా ఈ చిత్రంలో ముందు హీరోయిన్ గా వేరే హీరోయిన్ ని అనుకొన్నారు . కానీ అదృష్టం రష్మిక నే వరించింది..

నిజానికి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో హీరోయిన్ గా ‘ఫిదా’ బ్యూటీ సాయి పల్లవిని అనుకున్నారట. ఆ క్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి కూడా సాయి పల్లవిని కలిసి కథ వినిపించాడట. అయితే ఆమె ఈ చిత్రంలో ఓవర్ గా రియాక్ట్ అవ్వడం..కామెడీ చెయ్యడం… సెకండ్ హాఫ్ లో అయితే హీరో వెనకాలే తిరగడం వంటివి నాకు నచ్చలేదు అని చెప్పి రిజెక్ట్ చేసిందట.

ఫిదా వంటి సెన్సిటివ్ మూవీ చేసిన తరవాత సాయి పల్లవి నటించిన ‘ఎం.సి.ఏ’ చిత్రంలో ఆమె పాత్ర జోవియల్ గానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ` ఎం సి ఏ ` చిత్రంలో సాయి పల్లవి పాత్రకు `సరిలేరు నీకెవ్వరు ` చిత్రం లో హీరోయిన్ కి ఉన్నంత ప్రాముఖ్యత కూడా ఉండదు. మరి ఆ సినిమాని ఒప్పుకున్న సాయి పల్లవి.. ‘సరిలేరు నీకెవ్వరు ` వంటి సూపర్ హిట్ ను ఎందుకు వదులుకుందో మరి. ఒక్కోసారి కథ విన్న దానికి భిన్నంగా తెరమీద ప్రెజెంట్ చేయడం జరుగుతుంది .బహుశా సాయి పల్లవి కూడా అలాగే పొరబాటు పడి ఉంటుంది .