కరోనా:జగన్ ముందస్తు ప్రణాళికే ప్రజలను కాపాడిందా?

లక్షలకొద్దీ కేసుల.. లెక్కలేనన్ని ప్రాణాలు తీస్తున్న కరోనా ఇప్పుడు భారత్ ను భయపెడుతోంది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ఇంత దారుణంగా ప్రాణాలు తీస్తుందని ఎవరూ ఊహించలేదు. ఒకప్పుడు కరోనా గురించి తెలియకపోవడంతో దానిని ఎదుర్కొనేందుకు లాక్డౌన్ విధించుకున్నాం. అయితే ఇప్పుడు ఈ వైరస్ గురించి ప్రజల్లో పూర్తి అవగాహన ఉంది. ఎలా వస్తుంది..? దానిని ఎలా ఎదుర్కోవాలి..? అనే విషయాలపై ప్రజలు తెలుసుకున్నారు. ప్రస్తుతం కేసులు విపరీతంగా పెరుగుతున్నా లాక్డౌన్ విధించమని, అయితే ప్రజలు […]

Written By: NARESH, Updated On : April 23, 2021 8:48 am
Follow us on

లక్షలకొద్దీ కేసుల.. లెక్కలేనన్ని ప్రాణాలు తీస్తున్న కరోనా ఇప్పుడు భారత్ ను భయపెడుతోంది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ఇంత దారుణంగా ప్రాణాలు తీస్తుందని ఎవరూ ఊహించలేదు. ఒకప్పుడు కరోనా గురించి తెలియకపోవడంతో దానిని ఎదుర్కొనేందుకు లాక్డౌన్ విధించుకున్నాం. అయితే ఇప్పుడు ఈ వైరస్ గురించి ప్రజల్లో పూర్తి అవగాహన ఉంది. ఎలా వస్తుంది..? దానిని ఎలా ఎదుర్కోవాలి..? అనే విషయాలపై ప్రజలు తెలుసుకున్నారు. ప్రస్తుతం కేసులు విపరీతంగా పెరుగుతున్నా లాక్డౌన్ విధించమని, అయితే ప్రజలు ఆ స్టేజీకి రానివ్వకుండా సెల్ఫ్ కేర్ తీసుకోవాలని ఇటీవల ప్రధాన మంత్రి మోడీ సూచించిన విషయం తెలిసిందే . అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనా విషయంలో అదిరిపోయే నిర్ణయం తీసుకున్నాడు.

కొన్ని రోజులుగా ఏపీలో రోజూవారీ కరోనా కేసులు 10వేలకు పైగా ఉంటున్నాయి. మొన్నటి వరకు తక్కువ కేసులు నమోదైన రాష్ట్రంగా ఉన్న ఏపీ ఒక్కసారిగా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల సరసన చేరింది. అయితే ఏపీ ప్రభుత్వం కరోనా కేసుల పెరుగుదలపై ఏమాత్రం భయపడడం లేదు. కరోనాను కట్టడి చేయడానికి అన్నివిధాలా చర్యలు తీసుకునేలా బృహత్తర ప్రణాళిక వేసింది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్లో శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ విషయాన్ని ముందే గ్రహించిన ఏపీ ప్రభుత్వం జాగ్రత్త పడింది.

కరోనా రోగులకు శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువగా రావడంతో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఈ పరిస్థితి ఏపీలోనూ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 200 టన్నుల ఆక్సిజన్ అవసరం పడుతుందని, రోజూ 80 నుంచి 100 టన్నుల వరకు ఆక్సిజన్ అవసరం ఉంటుందని రాష్ట్రప్రభుత్వం గుర్తించింది. దీంతో కరోనా బాధితులకు ఆక్సిజన్ కొరత లేకుండా రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల నుంచి ఆక్సిజన్ తెచ్చేందుకు ప్రణాళికలు వేస్తున్నారు.

ఒకటి విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి అలాగే భువనేశ్వర్, బళ్లారి, చెన్నై నుంచి ఆక్సిజన్ తెప్పించేందుకు జగన్ సిద్ధమయ్యాడు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తానని నిర్ణయించింది. అయితే ఇప్పుడు ప్రజల ప్రాణాలు కాపాడడానికి అదే స్టీల్ ప్లాంట్ అవసరమవుతుంది. విశాఖ స్టీల్ పరిశ్రమ నుంచే పెద్ద పెద్ద లారీల్లో ఆక్సీజన్ తరలుతున్న తీరును చూసి దీనిని ప్రైవేటీకరణ చేయాలని ఎలా అనిపిస్తుందని కొందరు అంటున్నారు. ఇప్పటికైనా మనసు మార్చుకోండని హెచ్చరిస్తున్నారు వైసీపీ నాయకులు.

ఏదీ ఏమైనా ఏపీ సీఎం తీసుకుంటున్న ముందస్తు ఆక్సిజన్  నిర్ణయం ప్రజలకు ఇప్పుడు కష్టాల నుంచి దూరం చేసింది.   ప్రజలే కాకుండా ప్రతిపక్షాలు, కేంద్ర పెద్దలు కూడా జగన్ ముందస్తు ఆలోచనను కొనియాడుతున్నారు . మరోవైపు రాష్ట్రంలో రోజుకు 6 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేసిన మొదటి రాష్ట్రంగా నిలుస్తుంది. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో టీకా ఇచ్చిన రాష్ట్రం లేదు. అది కేవలం ఆంధ్రప్రదేశ్ కే దక్కుతుంది. ఇలాంటి జగన్ నిర్ణయాలపై మిగతా రాష్ట్రాల నాయకులు కూడా ప్రశంసిస్తున్నారు,